https://www.youtube.com/watch?v=BOPOHKf7AF8
ఇటీవల వెబ్ రివ్యూలు కేంద్రంగా జరుగుతున్న చర్చోపచర్చలు తెలిసిందే. తారక్ జైలవకుశ సక్సెస్ మీట్ లో తేనెతుట్ట ని కదపడం తో మొదలైన డిస్కషన్ ఆ తర్వాత మహేష్ బాబు రివ్యూలని, రివ్యూయర్లని సమర్థించడమూ, ఈరోజు మళ్ళీ మంచు విష్ణు వచ్చి లైవ్ అప్ డేట్స్ ఇవ్వడాన్ని విమర్శించడమూ జరిగింది. అయితే స్పైడర్ రివ్యూ విషయం లో తెలుగు 360 ట్వీట్స్ ని బాహుబలి నిర్మాత శోభు విభేదిస్తూ ట్విట్టర్ లో ట్వీట్స్ చేయడమూ, అయితే తెలుగు360 – పబ్లిక్ ఒపీనియన్ కి వీలైనంత దగ్గరగా తమ రివ్యూ ఉండేట్టు ఎంతో జగ్రత్తగా రివ్యూ వ్రాస్తామని స్పందించడమూ జరిగింది. అయితే టివి9 ఇవాళ తెలుగు360 ని ఫోన్ కాల్ లో సంప్రదించి లైవ్ లో వివరణ కోరడం తో, తెలుగు360 కూడా తమ వాదనని ప్రెజెంట్ చేసింది.
టివి9, మీరు ఇలా రివ్యూ ఇవ్వడం వల్ల అవి కొంచెం నెగటివ్ గా ఉంటే నిర్మాతలు నష్టపోతారు కదా అని ప్రశ్నించినపుడు – యూఎస్ లో ఒక సినిమాని చూడాలంటే సుమారు 200 డాలర్లు ఖర్చవుతున్న విషయాన్ని, అంత ఖర్చుపెడుతున్నపుడు రివ్యూ తెలుసుకున్నాకే సినిమా చూసే హక్కు ప్రేక్షకులకి ఉంటుందన్న విషయాన్ని తెలుగు360 తరపున టివి9 కి తెలియజేయడం జరిగింది. అలాగే రివ్యూలు వ్రాసే వారి అర్హత గురించి, రివ్యూలు ఎంతవరకు పబ్లిక్ పల్స్ ని ప్రతిబింబిస్తాయనే టివి9 ప్రశ్నకి, “రివ్యూలు సరిగా లేకపోతే ఆటొమేటిగ్గా ఆ సైట్ ప్రేక్షకుల నమ్మకాన్ని కోల్పోతుందనీ, తెలుగు 360 లో వచ్చిన రివ్యూలు దాదాపు 90% బాక్సాఫీస్ రిజల్ట్ కి దగ్గరగా ఉన్నాయని” వివరించడం జరిగింది.
అలాగే ఫిదా, పెళ్ళి చూపులు, అర్జున్ రెడ్డి లాంటి చిన్న సినిమాలకి ఈ రివ్యూల వల్లే ప్రత్యేకించి ఓవర్సీస్ లో మేలు జరిగిన విషయం కూడా గుర్తు చేయడం జరిగింది.