కమల్ హాసన్ – శంకర్ల క్రేజీ కాంబో ఎప్పటి నుంచో చర్చల్లో ఉన్నదే. వీరిద్దరూ కలిస్తే `భారతీయుడు 2` రావడం ఖాయమని చెప్పుకొన్నారు. ఇప్పుడు అదే నిజమైంది కూడా. అయితే ఈ ప్రాజెక్ట్ దిల్‌రాజు పట్టేస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. సడన్‌గా నిర్మాతగా దిల్‌రాజు పేరు చూడగానే.. అందరూ షాక్ అయ్యారు. అయితే దిల్‌రాజుకి ఇదేం అనుకోని వరం కాదు. ఎప్పటి నుంచో ఈ ప్రాజెక్ట్ గురించి ఆయన ఫాలో అప్‌లో ఉన్నారు. దాదాపు రెండున్నర యేళ్ల నుంది… శంకర్‌తో సంప్రదింపులు జరుపుతున్నాడు. శంకర్ నిర్మాతగా వ్యవహరించిన వైశాలిని తెలుగులో డబ్ చేశాడు దిల్‌రాజు. అప్పటి నుంచీ… వీరిద్దరి మధ్య ట్రావెలింగ్ జరుగుతూనే ఉంది. భారతీయుడు 2 లైన్ ఏడాది క్రితమే.. దిల్‌రాజుకి చెప్పేశాడట శంకర్. అప్పటి నుంచీ.. ఇంకా గట్టిగా ప్రయత్నాలు చేసి, చేసి చివరికి ఈ సినిమా పట్టేశాడు. తెలుగు, తమిళ భాషల్లో దిల్‌రాజు నే నిర్మాత. మిగిలిన అన్ని భారతీయ భాషల్లోనూ ఈ సినిమాని డబ్ చేసి విడుదల చేస్తారు. భారతీయుడు – లంచంపై సాగిన పోరాటం. ఈసారి రాజకీయాల్లోని అవినీతిని ఎండగట్టేందుకు ఓ సామాన్యుడు చేసే ప్రయత్నాన్ని చూపిస్తున్నారు. కమల్‌హాసన్ త్వరలోనే రాజకీయ పార్టీ పెట్టబోతున్నాడు. రాబోయే ఎన్నికలతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగబోతున్నాడు. ఆ ఎన్నికలకు ఈ సినిమా ఉపయోగపడాలన్నది కమల్ ప్లాన్.