పవన్ కళ్యాణ్, త్రివిక్రం ల కొత్త సినిమా జనవరి 10 న రిలీజ్ అని డేట్ ప్రకటిస్తూ ఆ మధ్య మ్యూజికల్ బిట్ విడులై, మంచి స్పందన పొందిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా నిర్మాత చినబాబు కి కొత్త టెన్షన్లు మొదలవుతున్నట్టు తెలుస్తోంది.
మొదటిది, ఈ సినిమా బడ్జెట్. దాదాపు 120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయం లో నిర్మాతకి మొదటి నుంచీ బాహుబలి లాంటివి కాకుండా మామూలు సోషల్ సినిమాలు అంత కలెక్షన్స్ రాబట్టగలవా అనే టెన్షన్ ఉన్నట్టు తెలుస్తోంది. బహుశా అందుకే స్పైడర్ ఫలితం విషయం లో నిర్మాత చినబాబు ప్రత్యేక ఆసక్తి ని కనబరిచారు. ఒకవేళ స్పైడర్ గనక 120 కోట్లు రాబట్టగలిగితే, ఇక తన సినిమాకూ టెన్షన్ ఉండదని భావించాడు. కానీ స్పైడర్ ఫలితం మరోలా రావడం తో ఆ టెన్షన్ అలాగే మిగిలిపోయింది.
ఇక రెండోది, పెరుగుతున్న బడ్జెట్. అనేకానేక కారణాల వల్ల పవన్ కళ్యాణ్ విదేశాలకి షూటింగ్ కి రావడానికి ఇష్టపడటం లేదు. సో, మొత్తం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ లో నే ప్లాన్ చేసారు. ఇలా అన్నినిటికీ సెట్స్ వేయడం వల్ల కాస్తా బడ్జెట్ పెరిగిపోతోంది. అలాగే రామోజీ లో షూటింగ్ అంటే స్టార్స్ అంతా ఉదయం 10 గంటల పైనే షూటింగ్ కి వస్తున్నారు, ఒక సీన్ తీసేసరికే లంచ్ టైం అవుతుంది. లంచ్ అయ్యాక ఒక సీన్ తీసే సరికే సాయంత్రం అయిపోతోంది. అలా అలా వర్కింగ్ డేస్ పెరిగి బడ్జెట్ మరింత పెరిగిపోతోంది. ఇక ఆ మధ్య బ్యాంకాక్ కి వెళ్ళి రెండు మూడు రోజుల్లోనే వెనక్కి వచ్చేసారు. వీటన్నింటికీ తోడు, త్రివిక్రం కూడా బడ్జెట్ కంట్రోల్ చేయడానికి ప్రత్యేక ప్రయత్నాలేవీ చేయడం లేదన్న భావనలో కూడా చినబాబు ఉన్నట్టు తెలుస్తోంది.