ప్రముఖ దర్శకుడు బోయపాటి నిన్న చంద్రబాబు ని కలిసి, సీఆర్డీఏ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజంటేషన్ ను అందజేశారు. వివరాల్లోకి వెళితే…
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో నిర్మాణాల కోసం ఇంతకు ముందు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో భేటీ అయిన సీఎం చంద్రబాబు తాజాగా మరో దర్శకుడు బోయపాటి శ్రీనుతో సమావేశమయ్యారు. రాజధానిలోని పవిత్ర సంగమం దగ్గర వెంకటేశ్వరుని ఆకృతి ఆలయ శిఖర నిర్మాణానికి సంబంధించిన ప్రజంటేషన్ను దర్శకుడు బోయపాటి శ్రీను బుధవారం సీఎం చంద్రబాబుకు అందజేశారు. తిరుమలేశుని మూడు నామాలు, ఆలయ గోపురం కింద నుంచి గోదావరి నదీ ప్రవాహం సాగేలా ఈ నిర్మాణం ఉండనుంది. దశావతారాల థీమ్‌తో ఆలయ శిఖర ఆకృతికి దర్శకుడు బోయపాటి శ్రీను రూపకల్పన చేశారు.
ఈ మేరకు ప్రజంటేషన్ను సీఆర్డీఏ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు బోయపాటి అందజేశారు. పూర్తి డిజైన్లని బోయపాటి త్వరలోనే సమర్పించనున్నారు. అయితే కృష్ణా పుష్కరాల సమయం లోనే బోయపాటికి ఈ బాధ్యత చంద్రబాబు ఇచ్చిన విషయం తెలిసిందే.