రేపు (శుక్రవారం) నాగచైతన్య, సమంతల పెళ్లి. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీళ్లు… ఎట్టకేలకు ఒక్కటి కాబోతున్నారు. గోవాలో పెళ్లి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే చైతూ, సమంత అక్కడికి చేరుకొన్నారు. శుక్రవారం హిందూ సంప్రదాయం ప్రకారం, శనివారం క్రైస్తవ సంప్రదాయ ప్రకారం పెళ్లిళ్లు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ముహూర్తాలు కూడా తెలిసిపోయాయి.
శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి మెహందీ కార్యక్రమం మొదలవుతుంది. రాత్రి 11 గంటల 52 నిమిషాలకు ముహూర్తం. శనివారం సాయిత్రం 5 గం. 30 నిమిషాల కు క్రైస్తవ సంప్రదాయ ప్రకారం పెళ్లి జరిపిస్తారు. ఈ పెళ్లికి అతిథులు వందమందే అని నాగ్ ముందే చెప్పాడు. హైదరాబాద్లోని ఎన్ కన్వెన్షన్లో రిసెప్షన్ ఏర్పాటు చేస్తారు. తేదీ, సమయం ఇంకా తెలియాల్సివుంది.