మహేష్ బాబు – కొరటాల శివ కాంబినేషన్లో ‘భరత్ అను నేను’ సినిమా రూపుదిద్దుకొంటోంది. ‘స్పైడర్’ ఫ్లాప్‌తో కాస్త కలత చెందిన మహేష్… ఈ సినిమా షూటింగ్ నుంచి అర్థాంతరంగా విదేశాలకు వెళ్లిపోయాడని, మహేష్ డుమ్మా కొట్టడంతో షూటింగ్ ఆగిపోయిందని సోషల్ మీడియాలో విస్క్రృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే.. ఈ విషయంపై మహేష్ సన్నిహితులు స్పందించారు. మహేష్ ‘బ్రేక్’ అర్థాంతరంగా ఏం తీసుకోలేదని, విదేశాలకు వెళ్లాలన్నది ముందే నిశ్చయమైన సంగతి అని, షూటింగ్ ఆపలేదని, షెడ్యూల్ ప్రకారమే జరుగుతోందని క్లారిటీ ఇచ్చారు.
‘భరత్ అను నేను’ షూటింగ్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతోందట. ముందు వేసుకొన్న షెడ్యూల్ ప్రకారం ఈనెల 15 వరకూ షూటింగ్ లేదట. ఈలోగా ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సెట్‌ని రూపొందిస్తున్నారని, సెట్ పనులు 13 లోగా పూర్తవుతాయని, 15 నుంచి షూటింగ్ మొదలవుతుందని, ఈనెల 19న మహేష్ కొత్త షెడ్యూల్లో పాలు పంచుకొంటాడని సన్నిహిత వర్గాలు తెలిపాయి. నిజానికి ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేద్దామనుకొన్నారు. అయితే ఆ ప్లాన్ మాత్రం మారింది. ‘భరత్ అను నేను’ వేసవి బరిలో నిలవబోతోంది.