“కలిసుందాం రా” సినిమా లో వెంకటేష్ అత్త గా బాగా పాపులర్ అయిన నటి, ప్రముఖ టివి యాంకర్ , టీవీ నటి, “మల్లిక” అనారోగ్యంతో కన్నుమూశారు. మహేష్‌బాబు కథానాయకుడిగా నటించిన ‘రాజకుమారుడు’ ( ఆమె తొలి చిత్రం), పంచదార చిలక, కలిసుందాం రా, సహా పలు చిత్రాల్లో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించారు.
ఆమె అసలు పేరు అభినవ. 1997-2004 మధ్యకాలంలో పలు టెలివిజన్ ఛానళ్లలో ప్రసారమైన కార్యక్రమాలకు యాంకర్ గా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఉత్తమ యాంకర్‌గా అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గత 20 రోజులుగా కోమాలోనే ఉన్నారు.