ఉయ్యాల జంపాల తో మంచి హిట్ సాధించి ఒక్కసారిగా దూసుకొచ్చిన యువనటుడు రాజ్ తరుణ్. సినిమ చూపిస్త మామ లాంటి హిట్లతో ఒక్కసారిగా ఇండస్ట్రీ ని ఆకర్షించినా ఆ తర్వాత వరుస ఫ్లాప్స్ తో కాస్త వెనుకబడ్డాడు. అయితే రాజ్ తరుణ్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్స్ మాత్రం భలే ఉన్నాయంటున్నారు ఇండస్ట్రీ జనాలు.
AK ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద పలు సినిమాలు చేయబోతున్నాడు హీరో రాజ్ తరుణ్. దాదాపు 4 సినిమాలు వరసగా చేయడానికి అగ్రిమెంట్ అయింది. అయితే దీనికి రెమ్యూనరేషన్ గా AK ఎంటర్ టైన్ మెంట్స్ అనిల్ సుంకర ఉంటున్న గేటెడ్ కమ్యూనిటీలోనే ఒక విల్లా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. దిల్ రాజు అల్లుడు కడుతున్న ఈ కమ్యూనిటీలో ఉన్న ఆ విల్లా ఖరీదు సుమారు 3.5 – 4 కోట్లు. అంటే ఈ నాలుగు సినిమాలకి కలిపి ఆయన రెమ్యూనరేషన్ సుమారు 3.5 కోట్లన్నమాట.