ఏ సినిమాకైనా ఆకర్షణ సూత్రం, మంత్రం.. టైటిలే. థియేటర్లకు రప్పించే గుణం టైటిల్‌కి ఉండాలి. అందుకే టైటిల్ విషయంలో చాలా రకాలుగా ఆలోచిస్తుంటారు దర్శక నిర్మాతలు. ఈ రోజు రెండు కొత్త సినిమాలు మొదలయ్యాయి. వాటి టైటిళ్లు కూడా ఆకట్టుకొనేలా ఉన్నాయి. నారా రోహిత్, జగపతిబాబు కథానాయకులుగా పరుచూరి మురళి దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ఈ రోజే ఈ చిత్రానికి కొబ్బరికాయ కొట్టారు. ఈ సినిమాకి ‘ఆటగాళ్లు’ అనే పేరు ఖరారు చేశారు. మరోవైపు సుశాంత్ కథానాయకుడిగా ఓ చిత్రం మొదలైంది. దీనికి మరో యువ కథానాయకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘చి.ల.సౌ’ (చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి) అనే టైటిల్ ఖరారు చేశారు. రుహాని కథానాయిక. వెన్నెల కిశోర్, విద్యుల్లేఖ పలు కీల పాత్రల్లో నటిస్తున్నారు.