ఈ మధ్య ఏ సినిమా విడుదలైనా కాంట్రవర్సీ అవడం కామనైపోయింది. నిన్న విడుదలైన రాజు గారి గది-2 మీద కూడా వివాదాలు మొదలయ్యాయి. రాజు గారి గది-2 సినిమాని ఫస్టాఫ్ కామెడీతోనూ, సెకండాఫ్ ఎమోషన్ తోనూ నింపాడు డైరెక్టర్ ఓం కార్. హారర్ కంటే ఎక్కువగా ఎమోషన్ మీద డిపెండ్ అయిన ఓం కార్ ఎలాగో నాగార్జున, సమంత ల స్క్రీన్ ప్రెజెన్స్ తో గట్టెక్కేసాడని ప్రేక్షకుల అభిప్రాయం. అయితే ఈ సినిమా ఫస్టాఫ్ లో వాడిన కామెడీ లో హైపర్ ఆది జబర్దస్త్ లో వాడిన పంచ్ లు యధావిధి గా వాడటం తో హపర్ ఆది సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు సమాచారం. అయితే హైపర్ ఆది ప్రస్తుతం ఇండియాలో లేకపోవడం తో ఆయన ఇండియాకి వచ్చాక స్పందించవచ్చని తెలుస్తోంది.
అయితే ఇక్కడ చిన్న మెలిక కూడా ఉంది. “పొడిచేస్తావా? ఏ పొడి, కంది పొడా ?” అనే డైలాగ్ జబర్దస్త్ లో హైపర్ ఆది వాడినప్పటికీ ఇదే డైలాగ్ ని ఇవివి సత్యనారాయణ లాంటి వాళ్ళు చాలా సినిమాల్లో వాడారు. అప్పుడు హైపర్ ఆది కూడా ఇవివి ని కాపీ కొట్టినట్టే అవుతుంది. అయితే కాజల్, గూగుల్ డైలాగులు మాత్రం హైపర్ ఆది కంటే ముందు వేరేవరైనా వేసినట్టు రికార్డులు లేవు. కాబట్టి హైపర్ ఆదికి అది అనుకూలమే. అయినా , హైపర్ ఆది నిజంగా లీగల్ గా ప్రొసీడవుతాడా లేక సన్నిహితుల దగ్గర పంచుకున్న ఆవేదన ని అక్కడితో వదిలేస్తాడా అనేది చూడాలి.