రాజశేఖర్ పై, ఈ రోజుల్లో రూ.25 కోట్లతో ఓ సినిమా అంటే రిస్కే. ‘గరుడవేగ’తో ఆ రిస్క్ తీసుకొన్నారు నిర్మాతలు. అటు రాజశేఖర్, ఇటు ప్రవీణ్ సత్తారు ఎన్నో ఆశలు పెట్టుకొన్న సినిమా ఇది. నవంబరు 3న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో సాగే సినిమా ఇది. సిన్సియర్ అండర్ కవర్ ఆఫీసర్ అయిన రాజశేఖర్, దేశ ద్రోహుల్ని ఎలా మట్టపెట్టాడో చూపిస్తున్నాడు ప్రవీణ్. ట్రైలర్‌ని టైటిల్‌కి ధీటుగా స్పీడు స్పీడు షాట్లతో కట్ చేశాడు. కాకపోతే క్లారిటీ మిస్సయ్యిందేమో అనిపిస్తోంది. ప్రవీణ్ సత్తారు ఏం చెప్పాలనుకొంటున్నాడో క్లారిటీ లేదు. కొన్ని డైలాగులు కూడా అస్పష్టంగా వినిపించాయి. ఫస్ట్ షాట్‌లోనే నాజర్ ‘శంకర్’ అన్నాడో, ‘శేఖర్’ అన్నాడో అర్థం కాదు. పూజా కుమార్ ‘నేను నీకు కొంచెం కూడా సీరియెస్‌గా అనిపించదా?’ అనే డైలాగ్‌లో గ్రామర్ మిస్టేక్ ఉంది. ‘నేను నీకు కొంచెం కూడా సీరియెస్‌గా కనిపించనా’ అని ఉండాలి. సన్నీలియోనిని బోలెడంత డబ్బులు ఖర్చు పెట్టి తీసుకొచ్చారు. ప్రమోషన్లలో భారీగా వాడుకోవాలని చూశారు. ట్రైలర్లో ఓ చిన్న షాట్లో కనిపిస్తుంది. అదీ ఆఖర్లో. అందరూ ఉరుకులు, పరుగుల మీదే ఉన్నారు. బాంబు బ్లాస్టులు, ఛేజింగులు.. చూస్తుంటే డబ్బింగ్ సినిమా చూస్తున్నామన్న ఫీలింగ్ కలుగుతుంది. నాజర్, కిషోర్, పూజా కుమార్‌లు దాన్ని మరింత ఎక్కువ చేశారు. కంటెంట్ దాచి.. థియేటర్లో సర్ప్రైజ్ చేద్దామనుకొంటున్నాడేమో దర్శకుడు. చూద్దాం… ఏం అవుతుందో.. ఎంత దాచాడో??