రాజకీయాల్లోకి ఇదిగో వచ్చేస్తున్నా, అదిగో వచ్చేస్తున్నానంటూ తెగ హడావిడి చేసేస్తున్న కమల్ హాసన్ … ప్రవేశంపై స్పష్టత ఇచ్చిన దగ్గర్నుంచి దేశంలో పలువురు ప్రముఖులను కలిసి చర్చలు జరిపే క్రమంలో ప్రధాని మోడీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌లను కూడా కలసిన సంగతి తెలిసిందే. భాజాపాకు కమల్ మద్ధతు పలికేట్టు ఉన్నాడని, భవిష్యత్తులో ఆ పార్టీతో కలిసి పనిచేసే అవకాశాలున్నాయని ఊహాగానాలు బలంగా వి నిపించాయి. కమల్ కూడా ఆ వ్యాఖ్యల్ని ఖండించలేదు. ఈ నేపధ్యంలో వచ్చే ఎన్నికట్లో కమల్-భాజాపా చెట్టాపట్టాలు ఖాయమనే పలువురు భావించారు.
అయితే తాజాగా కమల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ మాత్రం ఆశ్చర్యంలో ముంచింది. అప్పట్లో పెద్ద నోట్టరద్దు అనే దుమారం చెలరేగి దేశంలో ఆ రద్దును సమర్ధించే వారు, విమర్శించేవారు కొంత కాలం పాటు తమ తమ వాగ్భాణాలకు పదును పెట్టిన సంగతి తెలిసిందే. వారి కోవలోనే కమల్ కూడా నోట్ల రద్దును సమర్ధిస్తూ మాట్టాడాడు. దీని వల్ల దేశానికి ప్రయోజనమే అని తాను భావిస్తూన్నానన్నాడు. ఇప్పుడు ఇదే విషయం మీద కమల్ తాజా ఇంటర్వ్యూలో లెంపలేసుకున్నాడు. నోట్లరద్దు వల్ల ధనవంతులకు, కొందరు నేతలకు మాత్రమే ఉపయోగం కలిగిందన్నాడు. తొందరపడి, దీనిని సమర్ధించడం తన తప్పేనని అంగీకరించాడు. ప్రధాని మోడీ మీద కూడా కమల్ విమర్శలు గుప్పించాడు. వ్యక్తిగతంగా మోడీకి మద్ధతివ్వడం కూడా తప్పేనన్నాడు. ఈ విషయంలో కామ్రేడ్లు తనను ముందే హెచ్చరించారని, అయితే తాను పట్టించుకోలేదని పశ్చాత్తపం వ్యక్తం చేశాడు.
అయితే పెద్దగా చర్చనీయాంశంగా లేని రోజుల్లో నోట్లరద్దు గురించి కమల్ మాట్లాడడం, దీనిని సాకుగా చూపి మోడీని విమర్శించడం వెనుక మరేదో ఉందని రాజకీయ విశ్లేషకులు సందేహిస్తున్నారు. పురుఛ్చతలైవి జయ మరణం తర్వాత తమిళ రాజకీయాల్ని గుప్పిట పట్టాలనుకుంటున్న భాజాపా … కమల్ల బంధం పురిట్లోనే సంధి కొట్టినట్టడం వెనుక బలమైన కారణమే ఉండొచ్చునని ఊహిస్తున్నారు.