త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందే జూనియర్ ఎన్టీఆర్ చిత్రానికి పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టడం వారిద్దరి తమాషాలు బాగా ప్రచారం పొందాయి. బహుశా ఇలాటి సందర్బాలు ఇంత ఎక్కువగా చూపించడం, జూనియర్ మరీ మరీ నవ్వడం, పవన్ సహజశైలిలో నవ్వుతూనే కాస్త మితంగా స్పందించడం ఇవన్నీ ప్రత్యేకంగా కథనాలు రాశారు. ఇంతమంది స్టార్లున్నప్పుడు ఎలాగూ ఫోటోలు ప్రసారాలకు లోటుండదనుకుంటాం. కాని విచిత్రంగా తెలుగులో ఒక పెద్ద పత్రిక ఈ ఫోటోలు ప్రచురించలేదు. ఫ్యామిలీ పేజీలో ఆ వార్తకు జూ.. కుమారుడైన అభయ్ రామ్ కి సంబంధించిన శీర్షిక నిచ్చి వారి పోటోలే వేసి సరిపెట్టింది.పవన్ గురించి క్లుప్తంగా ప్రస్తావించడమే తప్ప ఫోటో వేయనే లేదు. బహుశా ఒక స్టార్ హీరో వున్నా పోటో వేయకపోవడం వూహకందని విషయమే. దీనికి ప్రత్యేక కారణాలేమైనా వున్నాయా? రాజకీయ కోణమో సాంకేతిక లోపమో జరిగిందా? చెప్పవలసిన అగత్యం లేదు గాని చెబితే అర్థమవుతుంది.