NTR ప్రస్తుతానికి మాంఛి జోరు మీద ఉన్నాడు. టెంపర్, నాన్నకుప్రేమతో, జనత గ్యారేజ్, జై లవ కుశ లాంటి హిట్ల తో పాటు బిగ్‌బాస్ సీజన్ 1 కారణంగా వచ్చిన క్రేజ్ తో ప్రస్తుతానికి టాప్ గేర్ లోవెళ్తున్నాడు. వీటితో పాటు లైనప్ కూడా పటిష్టంగా కనిపిస్తోంది -త్రివిక్రం, విక్రం కుమార్ లాంటి దర్శకులతో. అయితే NTR నెమ్మదిగా నందమూరి వంశం ముద్ర నుంచి బయటపడుతున్నాడాఅనే ఒక చర్చ ఇటీవల నడుస్తోంది.
NTR కి మొదటి నుంచి నందమూరి అభిమానులు వెన్నుదన్నుగా ఉన్నారు. ఇక మెగా ఫ్యాన్స్ నందమూరి ఫ్యాన్స్ మద్య కాస్త “టాంఅండ్ జెర్రీ” ఫైట్స్ కూడా దశాబ్దాల కాలం నుంచీ ఉన్నవే. ఒకఇరవయ్యేళ్ళ క్రితం చిరంజీవి హిట్లర్ సినిమా, బాల కృష్ణ పెద్దన్నయ్య సినిమా ఒకే నెలలో విడుదలైనపుడు అభిమానుల మద్య ఎక్కడో గొడవ జరిగితే, ఈనాడు పత్రికలో ” హిట్లర్సైన్యానికీ, పెద్దన్నయ్య తమ్ముళ్ళకీ యుద్దం” అని శీర్షిక పెట్టి వ్రాసారు ఆ న్యూస్ ని. ఇవిలా ఉంటే, ఆ మద్య బాలకృష్ణ తో కాస్తగ్యాప్ వచ్చింది NTR కి . దానికి తోడు ఇటీవల కాలం లో మెగా హీరోలతో బాగా సాన్నిహిత్యం పెరిగినట్టు కనిపిస్తోంది NTR కి. జైలవకుశ హిట్టయాక రాం చరణ్ ఎన్ టీయార్ పార్టీ లో మెరిస్తే, త్రివిక్రం సినిమా ప్రారంభోత్సవానికి స్వయంగా పవన్ కళ్యాణే హాజరై క్లాప్ కొట్టాడు. ఆ సందర్భంగా వారి మద్య జరిగిన ఆహ్లాదకర సంభాషణ ముచ్చటగొలిపింది. ఇక సాయి ధరం తేజ్ కూడా NTR కి తాను బాగా క్లోజ్ అని చాలా సందర్భాలలోచెప్పాడు. ఒక వేళ NTR తో మల్టీ స్టారర్ అవకాశం వస్తే ఎట్టిపరిస్థితుల్లో వదులుకోనని ఇటీవలే చెప్పాడు. ఇవన్నీ చూస్తూంటే, NTR కి మెగా హీరోలతో సన్నిహిత సంబంధాలు బాగానే ఉన్నట్టుతెలుస్తోంది.
నిజానికి అందరు హీరోలతో సత్సంబంధాలు ఉండటం ఏ హీరోకైనా మంచే చేస్తుంది. ఫ్యాన్స్ కి కూడా ఒక పాజిటివ్ మెసేజ్పంపినట్టు అవుతుంది అలా చేయడం ద్వారా. ఇక కెరీర్ పరంగాచూసుకున్నా, వివాద రహితంగా ఉంటూ, ఇలాంటి ఒక “యూనివర్సల్ అప్పీల్” కలిగి ఉండటం కూడా తెలీకుండానే కెరీర్‌కి మంచి చేస్తుంది. మొత్తానికి “గుడ్ గోయింగ్” NTR…