తెలుగురాష్ట్రాల్లో సినిమా, రాజకీయం, ఆఖరికి డ్రగ్స్ లాంటి క్రైమ్… దేన్నీ వదలకుండా ట్వీట్ల, ఫేస్ బుక్ పోస్ట్ ల ద్వారా ఒక ఆట ఆడుకుంటున్న దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ప్రస్తుతం తెలుగు నాట హాట్ టాపిక్‌గా మారిన రేవంత్‌రెడ్డి పార్టీ మారడంపైనా స్పందించాడు. తనదైన శైలిలో రేవంత్-కాంగ్రెస్‌ల కలయికను అభివర్ణించాడు.
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరడం నాకు చాలా చాలా హ్యాపీ అంటున్నాడు వర్మ. గతంలో కాంగ్రెస్ పార్టీ మీద ఆయనకు ఎందుకు నమ్మకం పోయిందో, అసలెలా పోయిందో తెలియదుగాని… ఆ పార్టీ అగ్రనాయకత్వం ఫీలయినట్టే ఫీలవుతూ ”రేవంత్ రెడ్డి చేరటం మూలాన నాకు కాంగ్రెస్ పార్టీ మీద మళ్ళి నమ్మకం వచ్చింది” అంటూ సంబరపడుతున్నాడు. సరే… అంతటితో వదులుతాడా? బాహుబలిని రాజమౌళి అయినా మర్చిపోతాడేమో గాని వర్మ మర్చిపోయేలా లేడు. గతంలో డ్రగ్స్ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీస్ అధికారిని బాహుబలితో పోల్చిన వర్మ… ఇప్పుడు రేవంత్‌ను కూడా అలాగే పోల్చాడు. ”కాంగ్రెస్ పార్టీ ఫిల్మ్ థియేటర్ అయితే రేవంత్ రెడ్డి బాహుబలి” అంటూ అభివర్ణించాడు. ధియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించిన… ”బాహుబలి బాక్సాఫీస్ కి నోట్ల వర్షం కురిపిస్తే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కి ఓట్ల వర్షం కురిపిస్తాడు” అంటూ నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. ఏదేమైనా.. వర్మ తెలుగు రాష్ట్రాల్లో జరిగే దేన్నీ కెలకకుండా వదిలేట్టు లేడు.