గరుడ వేగ కోసం సన్నీలియోన్‌ని పని గట్టుకొని బాలీవుడ్ నుంచి దిగుమతి చేశారు. సన్నీ వల్ల వసూళ్లు ఏ మేరకు పెరుగుతాయి అనేది రెండ్రోజుల్లో తేలిపోతుంది. అయితే సన్ని ఎఫెక్ట్ సినిమాపై బాగానే వర్కవుట్ అయ్యింది. అదెలాగంటే… ఈ సినిమాలో సన్ని `డియో డియో` అనే పాటలో కనిపించింది. పాట కోసం ఆమెకు రూ.50 లక్షల పారితోషికం ఇచ్చారు. ఆ పాట ముంబైలో తెరకెక్కించారు. అదీ సన్ని వెసులు బాటు కోసమే. పాట తెరకెక్కించడానికి మరో రూ.50 లక్షలైంది. అంటే.. మొత్తంగా కోటిరూపాయలన్నమాట.
ఈ కోటికి రెండున్నర కోట్లు తెచ్చిపెట్టింది సన్నీ. ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ రూ.2.5 కోట్లకు అమ్మేశారు. రాజశేఖర్ సినిమా డబ్బింగ్ రైట్స్ ఈ స్థాయిలో అమ్ముడు పోవడం విడ్డూరమే. కాకపోతే.. అక్కడ సన్ని ఇమేజ్ బాగా పనిచేసింది. సన్నీ పాట ఉన్నదన్న కారణంతో డబ్బింగ్ రైట్స్ విషయంలో కలిసొచ్చింది. అందుకే ఈ మాత్రం ధర పలికింది. తెలుగులో శాటిలైట్ హక్కుల్ని మా టీవీకి అమ్మబోతున్నట్టు తెలుస్తోంది. రూ.3 నుంచి రూ.4 కోట్లలోపు శాటిలైట్ రూపంలో రావొచ్చని సమాచారం. ఏరియాల వారిగా ఈ సినిమాని ఇప్పటికే ఇచ్చేశారు గానీ, చిత్రబృందానికి దక్కింది అడ్వాన్సులు మాత్రమే. సినిమా బాగుంటే.. పెట్టుబడి తిరిగి వస్తుంది. లేదంటే ఈ డబ్బింగ్, శాటిలైట్ రైట్స్ డబ్బులే నికరంగా కనిపిస్తాయి. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. ‘గరుడవేగ’ బాగానే వచ్చిందట. రాజశేఖర్‌కి ఇది కచ్చితంగా కమ్ బ్యాక్ సినిమా అవుతుందని, తెలుగులో కొత్త సినిమాల ఒరవడినికి నాంది పలుకుతుందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.