ఎవరైనా రాజకీయ నేత ఒక మాట మాట్లాడి ఆ మాట మీద నిలబడితే ఆశర్యపోయే రోజులివి… ఇక నేతలు పార్టీ లు మారడం అనే దాని గురించి అయితే ఇప్పుడు ఎంత చెప్పినా తీసికట్టే.
తెలంగాణ లో నేతలు ఎడా పెడా జెండాలు మార్చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎపిసోడ్ తర్వాత ఇది మరింత ముదిరింది. తాజాగా తే దే పా నేత కంచర్ల భూపాల్ రెడ్డి సోమవారం కేసీఆర్ కి జై కొట్టి టీ అర్ ఎస్ తీర్ధం పుచ్చుకున్నాడు.
తే దా పా లో సీనియర్ నేత అయిన ఈయన గతంలో ఒక భీషణ ప్రతిజ్ఞ చేసాడు. ఎందరు పార్టీ మారినా తాను మాత్రం చచ్చేంత వరకూ తే దే పా లొనే కొనసాగుతా అని. కానీ మరి ఇప్పుడు మాట తప్పాడు… అంతే ఈ నేతలంతా అనుకుంటున్నారు కదూ… కాదట. ఆయన మాట నిలబెట్టుకున్నాడట. కంచర్లకు కండువా కప్పి స్వాగతం పలికిన సాక్షాత్తు మంత్రి కేటీఆర్ ఈ విషయం చెప్పారు.
అదెలా అంటే… తెలంగాణ లో తే దే పా చచ్చింది అని, కాబట్టి అది చచ్చేంత వరకూ ఆ పార్టీ లొనే ఉన్న కంచర్ల మాట నిలబెట్టుకున్నట్టే అని కే టీ ఆర్ సెలవిచ్చారు. సో… ఇక నేతలు ఎవరైనా కంచర్ల బాటలో చచ్చేంత వరకూ పార్టీలోనే ఉంటా అని తొడ కొడితే… బాబూ విలేఖరులూ… కాస్త క్లారిటీ తీసుకోండి… ఎవరు చచ్చేంత వరకో…