ప్యారడైజ్ పేపర్ల ఆధారంగా తనపై తెదేపా చేసిన ఆరోపణలను నిరూపించాలని వైసీపీ అధినేత జగన్ విసిరిన సవాల్ పై తే దే పా నేతలు తలో రకంగా స్పందిస్తున్నారు… వీరిలో కాస్త భిన్నంగా అనిపించింది వర్ల రామయ్య స్పందన.
15 రోజుల్లో తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని జగన్ చేసిన సవాల్ పై వర్ల బదులిస్తూ… ఈ సవాల్ ను చంద్రబాబు కు కాకుండా సీబీఐ లేదా ప్యార డైజ్ లేదా వికీలీక్స్ లేదా ఇండియన్ ఎక్స్ ప్రెస్ లకు విసరాలని జగన్ కు సూచించారు. అలా కాకుండా బాబు నిరూపించాలని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ఆంతే కాదు తాను జగన్ అవినీతిని నిరూపిస్తా అని వర్ల రామయ్య ఛాలెంజ్ చేశారు. తనతో చర్చకు సిద్ధమా అని జగన్ ను ప్రశ్నించారు.
సరే… ఇంతదాకాఆ వచ్చాక ఇంకా చర్చలూ అవీ ఎందుకు రామయ్య గారూ… ఆ నిరూపించే పనేదో చేసేస్తే పోలా? ఎలాగూ నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని జగన్ సవాల్ చేశారుగా… మరి ఎందుకు ఆలస్యం?
అయినా… మనలో మన మాట… ఒక రాజకీయ నాయకుడి అవినీతి గురించి తెలిసీ, అది నిరూపించే సాక్ష్యాలు ఉండీ… కూడా నాన్చడం సరైనదేనా? చర్చిస్తే నిరూపిస్థా అంటే చర్చించకపోతే నిరూపించవా? మరి అవినీతి గురించి తెలిసి పట్టించ గలిగి కూడా అలా చేయకపోతే… చట్ట ప్రకారం అది కూడా తప్పే కదా…