హైదరాబాద్: కరీనా కపూర్ ఖాన్ బేగమ్ ఇవాళ తన పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నారు. ఇవాళ ఆమె 35వ సంవత్సరంలోకి ప్రవేశించారు. ఢిల్లీ శివార్లలో పటౌడీ కుటుంబానికి చెందిన పటౌడీ పేలెస్‌లో బర్త్‌డే పార్టీ జరిగింది. కరీనా, ఆమె భర్త సైఫ్ అలీ ఖాన్‌కు చెందిన సన్నిహిత మిత్రులు, కుటుంబసభ్యులమధ్య ఈ వేడుకలు జరిగాయి. కరీనా సోదరి కరిష్మా, మలైకా అరోరా, ఆమె సోదరి అమృత అరోరాకూడా ఈ పార్టీలో పాల్గొన్నారు. ఇటీవలి సూపర్ హిట్ చిత్రం బజరంగీ భాయిజాన్‌లో మెరిసిన కరీనా ప్రస్తుతం ‘ఉడతా పంజాబ్’, ‘కి అడ్ కా’ అనే చిత్రాలలో నటిస్తున్నారు. ‘ఉడతా పంజాబ్’చిత్రంలో మాజీ ప్రియుడు షాహిద్ కపూర్‌తో నటించటం విశేషం. షాహిద్ కపూర్‌కు ఇటీవలే వివాహమయింది. 2012లో కరీనా – సైఫ్ అలీ ఖాన్‌ను పెళ్ళి చేసుకున్న తర్వాత వీరి జంటను ‘సైఫినా’ అని పిలుస్తున్నారు.