ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు. మిగతా వాళ్ల సంగతి ఏమోగానీ బాలీవుడ్ కుర్ర నటుడు నణబీర్ కపూర్ మాత్రం ఓ హీరోయిన్ అదృష్టం తనను కూడా దరిద్రంలా పట్టాలని తెగ ఇదైపోతున్నాడు. వరసగా మూడు సినిమా ఫ్లాప్ అయ్యే సరికి అయ్యగారికి దిమ్మదిరిగిపోయింది. మరొక్క సినిమా ఫెయిలైతే ఇక ఇంట్లో కూర్చుని గోళ్లు గిల్లుకోవాల్సిందేనా అని కపూర్ కుర్రాడు టెన్షన్ పడుతున్నాడు.
నక్కను తొక్కిందో లేదో గానీ బాలీవుడ్ లో హిట్ల మీద హిట్లు కొడుతున్న దీపికా పదుకొనే తో పాటు తమాషా అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో ఇద్దరి రొమాన్స్ అదరహో అంటోంది యూనిట్. ఇద్దరూ రెచ్చిపోయి రొమాన్స్ పండించారట. ఎ ఆర్ రెహ్మాన్ ట్యూన్లు కట్టిన పాటల్లో ఈ జంట కన్నుల పంటగా కనిపిస్తుందంటున్నారు దర్శక నిర్మాతలు.
దీపిక, తాను చాలా కష్టపడ్డామని ఆమె అదృష్టం తనకు కలిసిరావాలని రణబీర్ కోరుతున్నాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయితే అది కచ్చితంగా దీపిక అదృష్ట మహత్యమే అంటున్నాడు. దాదాపు 60 కోట్ల రూపాయల బడ్జెట్ తో, దేశ విదేశాల్లోని అందమైన లొకేషన్లలో షూటింగ్ జరిపిన ఈ సినిమా మరో రెండు నెలల్లో, అంటే నవంబర్ 27న విడుదలవుతుంది.
ఒకే ఏడాది నాలుగు బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన అందాల తార దీపిక అదృష్టం రణబీర్ కు ఏమాత్రం కలిసొస్తుందో చూడాలి మరి.