ప్రముఖ నిర్మాత యం.ఎస్.రాజు కుమారుడు సుమంత్ అశ్విన్ ప్రస్తుతం ‘కొలంబస్’ అనే సినిమా చేస్తున్నాడు. దుబాయ్ లో వ్యాపారం చేస్తున్న అశ్విని కుమార్ సహదేవ్ మొట్టమొదట నిర్మిస్తున్న ఈ సినిమాతో ఆర్. సమల అనే కొత్త దర్శకుడు కూడా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో సీరత్ కపూర్ మరియు మిస్తి చక్రబర్తి (చిన్నదానా నీ కోసం ఫేం)హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘డిస్కవరీ ఆఫ్ లవ్’ అనే ట్యాగ్ లైన్ కలిగి ఉన్న ఈ సినిమా ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయిపోయింది.
ఇది పూర్తవగానే సుమంత్ అశ్విన్ మళ్ళీ మరో కొత్త దర్శకుడు మురళి కృష్ణతో కలిసి చేయబోతున్నాడు. 2012 సం.లో విడుదలయిన ‘ఆర్డినరీ’ అనే సూపర్ హిట్ కామెడీ మలయాళ సినిమాను తెలుగులో రిమేక్ చేయబోతున్నారు. ఒక బస్సు ప్రయాణంలో ఎదురయిన కొన్ని సంఘటనల సమాహారమే ఈ సినిమా. ఈ సినిమాలో సుమంత్ అశ్విన్, కీర్తి సురేష్ జంటగా నటిస్తారు. కొలంబస్ సినిమా షూటింగ్ పూర్తి కాగానే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది.