కహోనా ప్యార్ హై అంటూ పదిహేనేళ్ల క్రితం హృతిక్ రోషన్ తో రొమాన్స్ చేసి ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న అమీషా పటేల్ చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చింది. కపిల్ శర్మ నటించిన కిస్ కిస్కో ప్యార్ కరూ బాలీవుడ్ సినిమా ప్రత్యేక ప్రదర్శనకు ఆమె హాజారై సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ముంబై శాంతాక్రజ్ లోని లైట్ బాక్స్ ప్రివ్యూ థియేటర్ లో ఈ స్క్రీనింగ్ జరిగింది. ఎంతో మంది బాలీవుడ్ నటీనటులు, టెక్నీషియన్లు, దర్శక నిర్మాతలు వచ్చారు. ప్రస్తుతం డిమాండ్ లో ఉన్న చాలా మంది నటీనటులు సినిమా చూసి యూనిట్ ను అభినందించారు.
అయితే అమీషా పటేల్ గ్లామర్ అక్కడ హాట్ టాపిక్ గా మారింది. 40 ఏళ్ల వయసులో చలాకీగా ఆమె ఆ ఈవెంట్ లో ప్రతి ఒక్కరూ తలతిప్పి చూసేలా స్పెషల్ అట్రాక్షన్ అయింది. కహోనా ప్యార్ హై తర్వాత కొన్నేళ్లు బాలీవుడ్ లో ప్రముఖ హీరోయిన్ గా హవా చెలాయించింది. తర్వాత అవకాశాలు తగ్గాయి. ఈమధ్య కొంత కాలంగా అసలు మీడియా ముందుకు రావడం లేదు. కపిల్ సినిమా స్క్రీనింగ్ కోసం ప్రత్యేకంగా వచ్చిన అమీషా, తన కొత్త సినిమాల గురించి మాత్రం చెప్పలేదు. నటిగా, నిర్మాతగా ఒకప్పుడు ఎంతో బిజీగా ఉండేది. ఇప్పుడు ఆమె తాజా వెంచ్ ఏమిటో, ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటో చెప్పకపోయినా మూడు నాలుగు గంటల పాటు బాలీవుడ్ జనాలతో పాటు హడావుడి చేసింది.
అనుకోకుండా తళుక్కున మెరిసన అమీషా, సినిమా చూశాక కొందర్ని పలకరించి, అంతే చటుక్కున కారెక్కి వెళ్లిపోయింది. ఆమె గ్లామర్ రహస్యం అడుగుతామనుకుంటే అవకాశం రాలేదని కొందరు వ్యాఖ్యానించారు.