హీరోయిన్.. ఈ మాట అంటే చాలా క్రేజ్.. కవ్వించే కళ్లతో మత్తెక్కించే మోజులతో హొయలొలికిస్తూ ఆడియెన్స్ ను తమ బుట్టలో వేసుకుంటారు హీరోయిన్లు.. వారు థియేటర్లో కస్సు మంటే ప్రేక్షకుల గుండెలు జల్లుమంటాయ్. వారు ఒంపుసొంపులతో 100 రూపాయల టికెట్ కి, 100 లోకాలను చుట్టొచ్చేలా చేస్తారు. అయితే తెర మీద ఆడియెన్స్ నవ్వుల కోసం ఇన్ని చేస్తున్న హీరోయిన్లు.. తెర వెనుక జరిగే పరిణామాలను మాత్రం సమర్దించుకోలేకపోతున్నారు. హీరోయిన్ అంటే ప్రేక్షకుల్లో మంచి ఒపీనియన్ ఏర్పడినా ఎక్కడో ఏదో ఒక చిన్న అసంతృప్తి.
అది వారు చేస్తున్న ఎక్స్ పోజింగ్ అయినా కారణం కావొచ్చు.. లేదా సినిమా హీరోయిన్లు ఇలానే ఉంటారు అని చెప్పిన సందర్భాలు.. బయటకు వచ్చిన కొన్ని నిజాలు కారణం కావొచ్చు. ఏది ఏమైనా పరిశ్రమలో హీరోయిన్లు స్క్రీన్ మీద అందంగా కనిపించినా స్క్రీన్ వెనుక జరిగే పరిణామలకు ఎన్నో అగపాట్లు పడుతున్నారన్నది జగమెరిగిన సత్యం. హీరోయిన్లకు జరుగుతున్న అన్యాయాలు తెలిసినా ఎవరు నోరు మెదపరు.
ఎవరైనా నోరు తెరవడానికి ప్రయత్నించినా వెంటనే కొన్ని పెద్ద తలకాయలు వారి నోరు నొక్కేసి వారిని పరిశ్రమకు దూరంగా పడేస్తారు. ఇవన్నీ తెలిసినా, తెలియకపోయినా మళ్లీ ఇండస్ట్రీకి హీరోయిన్ అవుదాం అని రోజుకు కొన్ని వేలమంది సిటీకి వచ్చేస్తున్నారు. తెలిసినా గుర్తించని జ్ఞానం వారిదైతే.. విషయం ఇదీ అని ఎవరు విడమరిచి చెప్పే సాహసం లేక పోవడం ఇప్పటి కళాకారుల పరిస్థితి. హీరోయిన్ అవ్వాలంటే ఎన్నో ముళ్ల బాటలను దాటుకుని వెళ్లాలి.. కనిపించేంత అందమైనది కాదు సినిమా పరిశ్రమ అని గుర్తించుకుని ప్రయత్నించడం మేలు.