హైదరాబాద్: దేశంలోని టాప్ టెన్ లాయర్లలో ఒకరు, ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నాయకుడు ప్రశాంత్ భూషణ్ న్యాయవ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థలో అవినీతి వేళ్ళూనుకుపోయిందని, న్యాయమూర్తుల్లో అవినీతిపరులు ఉన్నారని అన్నారు. మరికొంతమంది న్యాయమూర్తులకు చట్టాలపై అవగాహన ఉండదని చెప్పారు. న్యాయమూర్తుల నియామకాలలో ప్రభుత్వాలు జోక్యం చేసుకుంటున్నాయని అన్నారు. సీవీసీ నేతృత్వంలో జరగాలని సూచించారు. ప్రశాంత్ భూషణ్ ఇవాళ హైదరాబాద్లో న్యాయవ్యవస్థలో సంస్కరణలు అనే అంశంపై జరిగిన సదస్సులో పాల్గొన్నారు. న్యాయం సామాన్యులకు అందనంత దూరంలో ఉందని అన్నారు. న్యాయవ్యవస్థలో గణనీయమైన మార్పులు రావాలని వ్యాఖ్యానించారు. మనదేశంలో ఇంకా బ్రిటిష్ కాలంనాటి వ్యవస్థే అమలవుతోందని అన్నారు. ప్రజల ప్రాధమిక హక్కులను రక్షించాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థపై ఉందని, అయితే కేవలం 2శాతం ప్రజలకు మాత్రమే న్యాయం జరుగుతోందని చెప్పారు.