ప్రపంచంలో ఎన్నో అద్భుత దృశ్యాలున్నాయి. టూరిస్టులను ఆకర్షించే అనేక అట్రాక్షన్స్ ఉన్నాయి. ఈనెల 27 ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఓ అద్భుతమైన టూరిస్ట్ స్పాట్ విశేషాలు. ఈ ఫొటోలో ఉన్నది జపాన్ లోని విస్టేరియా ఫ్లవర్ టన్నెల్. కిటక్యూషు నగరంలో ఉన్న ఈ ప్రదేశాన్ని కవాచి ఫ్యూజీ గార్డెన్ అని కూడా పిలుస్తారు. ఈ ఫ్లవర్ టన్నెల్ లో విహారం మరువలేని ఓ మధురమైన అనుభవం. అయితే ఏప్రిల్ నుంచి మే రెండో వారం వరకూ ఇక్కడ విహరిస్తేనే మజాగా ఉంటుందట. ఆ తర్వాత అంత అద్భుతమైన అనుభూతి ఉండదంటున్నారు నిర్వాహకులు.
రంగు రంగుల పువ్వులే గోడలుగా, పైకప్పుగా కనిపించే ఇక్కడ నడుస్తూ ఉంటే టైమే తెలియదు. కుటుంబాలే కాదు, ప్రేమికులు కూడా అందమైన పర్యాటక అనుభవం కోసం ఇక్కడికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ప్రత్యేకంగా ఈ టన్నెల్ టూర్ మేనేజర్లున్నారు. ఆన్ లైన్లో సంప్రదించి టూర్ ప్లాన్ చేసుకోవడానికి కూడా బోలెడు అవకాశాలున్నాయి.
జపాన్ రాజధాని టోక్యో నుంచి కారులో వెళ్తే సుమారు 5 గంటలు పడుతుంది. చాలా మంది జపాన్ వెళ్లే టూరిస్టులు టోక్యోలో దిగగానే ముందు ఈ ఫ్లవర్ టన్నెల్ టూర్ పూర్తి చేసేస్తారు. ఎఫ్పుడెప్పుడు ఈ అద్భుతాన్ని చూస్తామా అనే ఉత్సుకతతో ఉంటారు కాబట్టి ఇక్కడి పూల మరిమళాన్ని ఆస్వాదిస్తూ విహారాన్ని ముగించిన తర్వాతే జపాన్ లోని మిగతా టూరిస్ట్ ప్రదేశాలకు వెళ్తుంటారట. అదీ దీని గొప్పతనం.