రోబో సినిమాతో సౌత్ సినిమాల స్థాయిని పెంచిన డైరక్టర్ ఆ సినిమాతో దేశం గర్వించ దగ్గ దర్శకుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే తర్వాత అంతే అంచనాలతో వచ్చిన విక్రం ‘ఐ’ని మాత్రం ఆ రేంజ్లో చూపించలేకపోయాడు. ప్రస్తుతం రోబో-2 కోసం షూట్ కి రెడీ అయిన శంకర్ కు కొత్తగా ప్రొడ్యూసర్ రూపంలో కష్టాలు మొదలయ్యాయని కోలీవుడ్ టాక్. రోబో-2 ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిద్దామనే ఆలోచనకు ఆది లోనే హంసపాలు ఏర్పడే పరిస్థితి ఎదురయ్యింది. ముందు అనుకున్న విధంగా రోబో నిర్మించిన కళానిధి మారనే రోబో-2 ని కూడా నిర్మించదలచారు.
కాని రోబో-2 బడ్జెట్ దాదాపు 280 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ అవుతుండటంతో కళానిధి మారన్ సైడ్ అయ్యాడట. అందుకే ఇప్పుడు కొత్త నిర్మాతను వెతికే పనిలో ఉన్నాడు శంకర్. శంకర్ అంత గొప్ప దర్శకుడికి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ఆయన ఓకే అంటే చాలు పోటీ పడి మరీ ప్రొడ్యూస్ చేయడానికి క్యూలో నిలబడతారు.
ఎంతకాదనుకున్న బాహుబలి మేనియా రోబో శంకర్ కు నిద్ర పట్టకుండా చేసిందన్నది వాస్తవం. రోబో-2 బాహుబలిని తల దన్నేలా తెరకెక్కించాలనేదే శంకర్ పట్టుదల. అయితే ఫారిన్ ప్రోడ్యూసర్ ఎవరో శంకర్ తో మంతనాలు జరుపుతున్నట్టు టాక్. ఫారిన్ నిర్మాత అంటే సినిమాను హాలీవుడ్ రేంజ్లో తీస్తున్నారనేది తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాలో ఆర్నాల్డ్ ని విలన్ గా పెట్టాలనే ఆలోచనలో ఉన్నాడు శంకర్. మరి ఫైనల్ గా ప్రొడ్యూసర్ గురించి మరింత సమాచారం త్వరలో తెలియనుంది.