FBపై ఈ`మచ్చ’ తొలిగేది కాదు…!

సోషల్ మీడియాలో కీలకపాత్ర పోషిస్తున్న ఫేస్ బుక్ పై పడిన మచ్చ అంతతొందరగా తొలిగిపోయేదికాదు. సామాజిక భావచైతన్యానికి ప్రతీకగా నిలిచిన FB అనుకోనిరీతిలో ఇరకాటంలో పడింది. ప్రస్తుతానికి తప్పుసరిదిద్దుకున్నా విశ్వసనీయతనుమాత్రం కోల్పోయింది. దీనికి తోడు మోదీకి తలనొప్పి తెచ్చిపెట్టింది.

అసలేం జరిగిందంటే..

భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించిన డిజిటల్ ఇండియా ఉద్యమానికి ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకెర్బర్గ్ కొత్త తరహాలో మద్దతు మొదలుపెట్టారు. అప్పటికప్పుడు ఫేస్ బుక్ ద్వారా డిజిటల్ ఇండియాకు మద్దతు పలికేవారు తమ ప్రొఫైల్ పిక్చర్ ని మార్చుకునే సాంకేతిక సహాయం అందరికీ అందుబాటులోకి తెచ్చారు. ఫేస్ బుక్ అకౌంట్ ఉన్న ప్రతిఒక్కరికి fb.com/supportdigitalindia అనే లింక్ అందుబాటులోకి వచ్చేసింది. ఈ సాంకేతిక సహాయాన్ని అందిపుచ్చుకున్న ఫేస్ బుక్ అకౌంట్ హోల్డర్స్ – డిజిటల్ ఇండియా మహోద్యమానికి తమ ప్రొఫైల్ పిక్చర్స్ మార్చడం ద్వారా సపోర్ట్ పలకడం మొదలుపెట్టారు. ఇదో ప్రతిజ్ఞలా సాగింది.

ఈ లింక్ నొక్కగానే ఆకౌంట్ హోల్టర్ తాను అప్పటికే ఉంచిన ప్రొఫైల్ పిక్చరే డిజిటల్ ఇండియా మద్దతు కోసం తయారుచేసిన త్రివర్ణ లోగో పై సూపర్ ఇంపోజ్ గా కనబడుతుంది. Show your Support for Digital India పేరిట మీ పోటో త్రివర్ణ శోబితంగా (జాతీయ పతాకంలోని మూడు రంగులతో) మీ ముందు ప్రత్యక్షమవుతుంది. అలా వచ్చిన ఫోటోని ప్రొఫైల్ పిక్చర్ గా మార్చుకునే వెసులుబాటు కల్పించారు. దాని క్రింద ఫేస్ బుక్ వారు ….Thanks for showing your support. You’re helping transform India into a digitally empowered society అంటూ ధన్యవాద తీర్మాన వాక్యాలు ఉంచారు.

modi-digitalindia-

ఫేస్ బుక్ పట్ల మక్కువ, ఆపైన మోదీ పట్ల క్రేజ్ తో చాలామంది తమ ఫేస్ బుక్ అకౌంట్లలో ప్రొఫైల్ పిక్చర్ ని త్రివర్ణశోభితంగా మార్చుకుంటూ డిజిటల్ ఇండియాకు తమ పూర్తి మద్దతు ఇచ్చినట్లు తెగసంబరపడిపోయారు. అయితే…. నిజానికి వారు మద్దతు ఇచ్చింది డిజిటల్ ఇండియాకు కానే కాదు! ఫేస్ బుక్ కి చెందిన ఇంటర్నెట్. ఆర్గ్ కి మాత్రమే వారు తమ మద్దతు తెలిపినట్లయింది. ఇది తెలియక చాలామంది అప్పటికే FBలో PPలను మార్చేసుకున్నారు. ఈలోగా అసలు నిజం బయటపడింది. nextbigwhat.com ఇందులోని మర్మం బయటపెట్టడంతో డిజిటల్ ఇండియా మద్దతుదారులు విస్తుపోవాల్సివచ్చింది.

`కోడ్’ అలా కోసింది

ఫేస్ బుక్ లో మనం పోస్ట్ చేసే ట్రైకలర్ ప్రొఫైల్ పిక్చర్స్ ను ఇంటర్నెట్ . ఆర్గ్ కే ఉపయోగపడేలా కోడ్ తయారుచేయడంతో ఇదంతా జరిగిపోయిందని nextbigwhat.com తేల్చిచెప్పేసింది. ఒక అమెరికావాసి మనదేశ మహోద్యమాన్ని (డిజిటల్ ఇండియాను) మెచ్చుకుంటూ ట్రైకలర్ లో ప్రొఫైల్ పిక్చర్ మార్చుకుంటే, భారతీయవాసులమైన మనం వెనుకబడటమేమిటన్న ఆలోచన ఓ కెరటంలా ఉవ్వెత్తున ఎగిసింది. దీంతో భారతీయులు చాలామంది తమ ప్రొఫైల్ పిక్చర్స్ ని అప్పటికప్పుడు మార్చుకున్నారు. అలా మార్చడం తమకెంతో గర్వంగా ఉందని చాటిచెప్పారు.

డిజిటల్ ఇండియా ఉద్యమాన్ని సపోర్ట్ చేయడంకోసం తయారుచేసిన కోడ్ లో కొంతభాగం ఇలా ఉంది….
“_internetOrgProfilePicture_prideAvatar” దీనివల్లనే సమస్య ఉత్పన్నమైంది.

ఎవరో చెప్పేదాకా, నిరసన సెగ తగిలేదాకా ఫేస్ బుక్ ఈ తప్పును గుర్తించనేలేదు. ఒక టెక్నీషియన్ (ఇంజనీర్) చేసిన తప్పు కారణంగా ఇంత రభస జరిగింది. దీంతో ఈ కోడ్ లోని ఆ భాగాన్ని “_digitalIndiaProfilePicture_prideAvatar” గా సరిచేసినట్లు ఫేస్ బుక్ అధికారులు చెప్పుకోవాల్సి వచ్చింది.

కోడ్ లో తమకు అనుకూలంగా మార్చడమన్నది ఇంటర్నెట్ స్వేచ్ఛకు భంగంకలిగించేదిగా ఉందన్న విమర్శలు తలెత్తాయి. ఒక గొప్ప ఉద్యమానికి సపోర్ట్ చేశామన్న తృప్తిని ఫేస్ బుక్ ఖాతాదార్లకు లేకుండా చేయడం కుట్రపూరిత చర్యేనని కూడా కొందరన్నారు. త్రివర్ణ శోభితంగా చూడగానే ఆనందం కలిగించే రీతిలో ఉన్న లోగోపై ప్రొఫైల్ పిక్చర్ రావడం చాలామందికి సంతృప్తిని కలిగించింది. ఫేస్ బుక్ సీఈఓ జుకెర్బర్గ్ తన పిక్చర్ని డిజిటల్ ఇండియాకు మద్దతుగా మార్చేశారు. ఇక నరేంద్ర మోదీ సైతం ముచ్చటపడ్డారు. దీంతో ప్రొఫైల్ పిక్చర్ మార్పు చేయాలన్న భావన ఇండియన్స్ లో పెరిగిపోయింది. తీరా ఫేస్ బుక్ చేసిన పొరపాటుతో చాలామంది నాలుక కరుచుకోవాల్సివచ్చింది. ఇంజనీర్ చేసిన పొరపాటుకు ఫేస్ బుక్ వివాదంలో చిక్కుకుంది. చివరకు తప్పు సరిదిద్దుకోవాల్సివచ్చింది. కోడ్ సరిచేశారు కాబట్టి, ఇక ఇప్పుడు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరంలేదు. నిరభ్యంతరంగా ప్రొఫైల్ పిక్చర్ ని మార్చుకుని మహోన్నతమైన డిజిటల్ ఇండియా ఉద్యమానికి మీ ట్రైకలర్ పోటోతో పూర్తి మద్దతు ఇవ్వొచ్చు.

కొసమెరుపు

అయినప్పటికీ, ఫేస్ బుక్ పై పడిన మచ్చ తొలిగిపోయినట్లు కాదు. రేపు ఇలాంటిదేదైనా ఉద్యమంగా ఫేస్ బుక్ యాజమాన్యం చేపట్టినప్పుడు యూజర్స్ కి ఎన్నో అనుమానాలు కలగడం సహజం. చంద్రునిపై మచ్చలాగా ఫేస్ బుక్ పై ఈ మచ్చ మాత్రం అలాగే ఉండిపోతుంది. దాని విశ్వసనీయత ఇక ఎప్పటికీ సందేహాస్పదమే.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మారుతికి ముందే తెలుసా?

రాజ్ తరుణ్ కి హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. రెండు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రాజ్ నుంచి వచ్చాయి. పురుషోత్తముడు, తిరగబడరాస్వామి, భలే ఉన్నాడే. ఈ మూడు ఫ్లాపులే. భలే ఉన్నాడే చాలా...

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

చిట్‌చాట్‌లతో BRSను చిరాకు పెడుతున్న రేవంత్ !

రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే మాటలు మీడియాలో హైలెట్ అవుతూంటాయి. వాటిని పట్టుకుని బీఆర్ఎస్ ఆవేశ పడుతోంది . అంతా అయిపోయిన తరవాత తీరిగ్గా.. నేను ఎప్పుడన్నాను అని రేవంత్...

ఢిల్లీ తర్వాత సీఎం కూడా కేజ్రీవాలే ?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు ఢిల్లీ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సీఎంగా కేజ్రీవాల్ ఎవరికి చాన్సిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. విచిత్రంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close