అందాల ముద్దుగుమ్మ కృతి కర్బందా చరణ్ బ్రూస్ లీ సినిమాలో అక్కగా నటించినడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అంటే పరిశ్రమలో ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్స్ ఈ నిర్ణయం తీసుకుంటారు. అయితే తెలుగులో కెరియర్ అంత సాటిస్ఫైడ్ గా లేదు కాబట్టి కృతి ఈ డిసిషన్ తీసుకున్నా..కన్నడలో అమ్మడు స్టార్ హీరోయిన్ గా ఏలుతుంది. సినిమాలో చరణ్ తర్వాత అంత వెయిట్ ఉన్న క్యారక్టర్ ఆమెదే కావడం విశేషం. బూస్ లీ అనగానే యుద్ధ వీరుడి కథ అనుకుంటాం అయితే ఈ బ్రూస్ లీ తన ఫ్యామిలీ కోసం ఫైటింగ్ చేస్తాడు.
సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ బాగా ఉంటుందని ఆడియో రిలీజ్ వేడుకలో చరణ్ ఎనౌన్స్ చేశాడు. అయితే బ్రూస్ లీలో అక్క పాత్ర వేసిన కృతి చుట్టే కథ తిరుగుతుందన్న మాట. అందుకే అమ్మడు సిస్టర్ క్యారక్టర్ అయినా కాదనకుండా చేసేస్తుంది. తీన్మార్, ఒంగోలు గిత్త, కళ్యాణ్ రామ్ ‘ఓం’ సినిమాలో నటించి అలరించిన క్యూట్ బ్యూటీ కృతి కమర్షియల్ గా సక్సెస్ కొట్టకపోయినా అమ్మడికి తెలుగులో ఫ్యాన్స్ బాగానే ఉన్నారు.
బ్రూస్ లీ సినిమాలో హీరోయిన్ గా చేసింది రకుల్ ప్రీత్ సింగ్.. పాటల్లో చూస్తుంటే అమ్మడు ఈ సినిమాలో రెచ్చిపోయిందనే చెప్పొచ్చు. అయితే మెయిన్ హీరోయిన్ అయిన రకుల్ స్కిన్ షోకే ఉందనిపిస్తుంది. ఈ లెక్కన చూస్తే సినిమాలో హీరోయిన్ రకుల్ కన్నా సిస్టర్ క్యారక్టర్ వేసిన కృతినే పై చేయి సాధించినట్టు.