రాజధాని నిర్మాణం కోసం ఆ ప్రాంతంలో రైతుల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ గట్టిగా పోరాడిన వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు విజయనగరం జిల్లా, భోగాపురం గ్రామం రైతుల తరపున పోరాడేందుకు సిద్దం అవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భోగాపురం వద్ద విమానాశ్రయం నిర్మించదానికి భూసేకరణ చేస్తోంది. దానిని అక్కడి రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రెవెన్యూ అధికారులు అక్కడ సర్వే చేయడానికి వెళ్ళినప్పుడు గ్రామస్తులు తీవ్రంగా ప్రతిఘటించారు. తమ జీవానాధారమయిన పంట భూములను లాక్కోవద్దని రైతుల విజ్ఞప్తిని ప్రభుత్వం పట్టించుకోకుండా ముందుకే వెళుతుండటంతో రైతులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారికి మద్దతుగా నిలబడి పోరాడేందుకు జగన్ ఈరోజు భోగాపురం పర్యటించబోతున్నారు. ఆయన రైతులతో మాట్లాడిన తరువాత తదుపరి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.