విశ్వం మొత్తం మీద సౌందర్య రాశిగా ఎప్పుడో లారా దత్తా కిరీటాన్ని ధరించేసింది. పదిహేనేళ్ల క్రితమే మిస్ యూనివర్స్ గా మెరుపులు మెరిపించిన లారా దత్తా ఎందుకో చాలా స్ట్రిక్టుగా వార్నింగ్ ఇచ్చింది. అభిమానులైనా సరే, ఫేక్ పనులు చేస్తే ఊరుకునేది లేదని ఓ స్టేట్ మెంట్ ఇచ్చింది. తాను ఫేస్ బుక్ లో లేనని లారా దత్తా మరోసారి క్లారిఫై చేసింది. తన పేరు మీద ఉన్న ఎకౌంట్లనీ ఫేక్ అని తేల్చేసింది. అభిమానులైనా, మరెవరైనా తన పేరుతో తన ఫొటోలతో పేజీ ఓపెన్ చేసి ప్రజలను మోసం చేయవద్దని వార్నింగ్ ఇచ్చింది.
తన పేరు మీద ఉన్న ఫేస్ బుక్ ఎకౌంట్ నుంచి ఏం వచ్చినా యాక్సెప్ట్ చేయవద్దు, లైక్ చేయవద్దని సూచించింది. తాను ఈ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లో లేని విషయం ఇంతకు ముందే చెప్పానని గుర్తు చేసింది. ఈ మధ్య సైబర్ నేరాలు ఎక్కువై పోయాయి. సెలెబ్రిటీల పేరుతో ఫేస్ బుక్ ను దుర్దినియోగం చేసే ట్రెండ్ కూడా పెరుగుతోంది. అందుకే లారా దత్తా ముందు జాగ్రత్తగా అందరినీ హెచ్చరించింది. ముఖాన చెరగని చిరునవ్వుతో అందానికి అందంలా ఉండే లారాకు కాస్త కోపం వచ్చినా, ఎవరూ మోసపోవద్దనే ఉద్దేశంతోనే ఘాటు వార్నింగ్ ఇచ్చింది.
నాలుగేళ్ల క్రితం టెన్నిస్ ప్లేయర్ మహేష్ భూపతిని పెళ్లాడిన లారా, ఇంకా వెండితెరమీద మెరుపులు మెరిపిస్తూనే ఉంది. ఈ మధ్యే ఆమె నటించిన సింగ్ ఈజ్ బ్లింగ్ సినిమా విడుదలైంది. సో, లారా పేరుతో ఫేస్ బుక్ లో చెలామణిలో ఉన్న ఎకౌంట్లు ఫేక్ అన్న విషయం ఎవరూ మర్చిపోవద్దు. పారా హుషార్.