యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి రుద్రమదేవి దర్శక నిర్మాత గుణశేఖర్ చేసిన కామెంట్స్ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఈ నెల 9న రిలీజ్ అవుతున్న రుద్రమదేవి సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఛానెల్లో ఇంటర్వ్యూ ఇచ్చిన గుణశేఖర్ గోన గన్నారెడ్డి క్యారక్టర్ క్కి చాలా మంది హీరోలను అడిగానని కాని వారెవరూ చేయడానికి సుముఖత చూపలేదని అన్నాడు.
అయితే జూనియర్ మొదటి సినిమా బాల రామాయణం దర్శకుడిగా ఎన్టీఆర్ ని ఆ పాత్ర కోసం అడిగితే గోన గన్నారెడ్డి పాత్రనే సినిమా హీరోగా చేసి కథ మార్చమన్నాడని షాకింగ్ కామెంట్స్ చేశాడు. అయితే రుద్రమదేవి చరిత్రతో సినిమా తీస్తూ అలా చేయడం ఇష్టంలేని గుణశేఖర్ ఆయన్ను కాదని వచ్చేశాడట.
అయితే ఆ పాత్ర కోసం హీరోని వెతుకుతున్నానని తెలిసి అల్లు అర్జునే ఫోన్ చేసి ఆ క్యారక్టర్ చేస్తానని చెప్పాడని.. సినిమాలో రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా పని చేశాడని అన్నాడు. వచ్చే లాభాల్లో షేర్ ఇస్తే చాలని అన్నాడట అల్లు అర్జున్. మరి గుణశేఖర్ బయటపెట్టిన ఈ కామెంట్లకు ఎన్టీఆర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.