సోషల్ విప్లవం వచ్చాక అభిమానుల పిచ్చి తారా స్థాయికి చేరిందని చెప్పొచ్చు. ఒకప్పుడు సెలబ్రిటీస్ తో హాయ్ అని అనిపించుకుంటే చాలు అనుకునే అభిమానులు వారినే ప్రశ్నించే స్థాయికి ఎదిగారు. మరీ ట్విట్టర్, ఫేస్ బుక్ వచ్చాక సెలబ్రిటీస్ కు వాల్యూ లేకుండా చేస్తున్నారు. మీడియాకు స్వాతంత్రం ఇచ్చింది అభిప్రాయలు వ్యక్తపరిచేందుకే అంతేకాని దాని దుర్వినియోగం చేయడానికి కాదని అన్నాడు షారుఖ్ ఖాన్.
అయితే షారుఖ్ ఈ హాట్ కామెంట్స్ చేయడానికి కారణం లేకపోలేదు. తను సల్మాన్ ఖాన్ మంచిగా ఉంటున్నా కేవలం ఫ్యాన్సే కావాలని దాన్ని రచ్చ చేస్తున్నారని అభిప్రాయపడ్డాడు. అంతేకాదు ఉద్దేశ పూర్వకంగా ఏ సెలబ్రిటీ అయినా సరే బాధపడే విధంగా ట్వీట్ మెసేజ్ చేస్తే అలాంటి వారు తన అభిమానులు కాదంటూ మండిపడ్డాడు.
మరి షారుఖ్ ఇచ్చిన ఈ వార్నింగ్ ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి. అయినా ఎవరు ఏం చెప్పినా, ఎంత మొత్తుకున్నా పోకిరీలు వారు చేసే పనులు మాత్రం చేసుకుంటూ పోతారు