సాధారణంగా కొత్తక వింత పాతొక రోత అంటారు కదా కాని ఇక్కడ కొత్తొక వింత పాతొక మరో వింత అని అంటున్నారని ఆశ్చర్యపోవచ్చు. కాని ఇప్పటి దర్శక నిర్మాతల తీరు చూస్తే సామెతను పాత దానికన్నా ఇలా అంటేనే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే సినిమాల్లో కథ.. కామీషు లేకుండా సినిమాలు చేసి ఆడియెన్స్ మీద వదిలేస్తే చూడరని తెలిసి మళ్లీ అలాంటి సినిమాలే చేసి వదులుతున్నారు. అయితే ఇది దర్శకుడి తప్పో.. నిర్మాత తప్పో అసలే కాదు.. అయితే తప్పంతా ఆడియెన్స్ ది అనుకునేరు వాళ్లది కాదు. మరి ఇంకెవరిది..
మారుతున్న కాలం ప్రకారం మనుషులు వారి మనస్థత్వాలు.. ఆహారపు అలవాట్లు అన్ని మారుతున్నాయ్.. మనిషి తాను మారుతూ టెక్నాలజీని కూడా మార్చేస్తున్నాడు. నిన్న కాక మొన్న వచ్చిన 3జి కూడా పోయి 4జి యుగం రానేవచ్చింది. ప్రపంచంలో ఇన్ని మార్పులొస్తున్నా మనిషి సినిమాల్లో మార్పులని మాత్రం చూడలేకపోతున్నాడు. అవే ఫైట్లు.. అవే నరుక్కోడాలు.. అవే సినిమాలు..
మరి దీనికి ముగింపు లేదా అంటే.. అలాంటి సినిమాలను తిప్పికొట్టి షాక్ ఇస్తున్నారు ఆడియెన్స్.. ప్రపంచం మారుతుంది మీరు కూడా మారండి.. మమ్మల్ని మార్చండి అని దర్శక నిర్మాతలకు సవాళ్లు విసురుతున్నారు. దాన్ని గమనించి సరికొత్త అంశాలతో సినిమా తీస్తే బెటర్ లేదంటే ఆడియెన్స్ ఎన్ని ప్రయత్నాలు చేసినా తిప్పి కొడతారు. ఆడియెన్స్ అంతా అడ్వాన్స్ అయిపోయారు. అందుకే వారికి కొత్తక వింతలా కాకుండా పాత సినిమా ఒక వింతలా కనిపిస్తుంది. కాబట్టి బీ ఎలర్ట్ దర్శక నిర్మాతలు. తీసే సినిమాలు పాత వింతలా ఉండాలా.. కొత్త పుంతలు తొక్కాలా అన్నది మీరే ఆలోచించాలి.