మొదట్లో యూత్ ని ఎట్రాక్ట్ చేసే సినిమాలతో కమర్షియల్ గా అయితే సినిమాలు హిట్ కొట్టినా దర్శకుడిగా మారుతికి మంచి పేరు రాలేదు. అయితే రీసెంట్ గా వచ్చిన భలే భలే మగాడివోయ్ తో ఒకేసారి సూపర్ రేంజ్ కి వెళ్లిపోయాడు ఈ డైరక్టర్. ఎప్పటినుండో అల్లు అర్జున్ తో సినిమా తీద్దామనే ప్లాన్లో ఉన్నాడు మారుతి. ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ కూడా ఉంది. అయితే మొన్నటిదాకా ఓ టైప్ ఆఫ్ ఆడియెన్స్ ని మాత్రమే టార్గెట్ చేస్తూ మారుతి సినిమాలు ఉండటం వలన కాస్త కంగారు పడ్డాడు బన్నీ.
అందుకే ముందో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేసి హిట్ కొట్టి చూపించు.. ఆ తర్వాత మన సినిమా ఆలోచిద్దాం అన్నాడట మారుతితో. బన్నీ కోరిక మేరకు చెప్పింది చేసి చూపించాడు. భలే భలే మగాడివోయ్ సినిమా సూపర్ హిట్ కొట్టి ట్రెండ్ సృష్టించాడు. నానికి కూడా ఇది కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ కావడం విశేషం. కేవలం 6 కోట్లతో నిర్మించిన ఈ సినిమా దాదాపు 27 కోట్ల షేర్ ని తెచ్చిందని టాక్.
మరి ఇంత పెద్ద హిట్ ఇచ్చి ఫ్యామిలీ ఆడియెన్స్ కి కూడా మారుతి దగ్గరయ్యాడు కాబట్టి బన్నీ సినిమాకు ఓకే చెప్పే సూచనలే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మారుతి అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన సుశాంత్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడు. మరి దాని తర్వాత బన్నీ మారుతి లైన్ క్లియర్ చేస్తాడనే నమ్ముతున్నాడు.