గుణ టీమ్ వర్క్స్ పతాకంపై డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ స్వీయ నిర్మాణ, దర్శకత్వంలో తెరకెక్కించిన “రుద్రమదేవి” సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. అందులో అత్యంత కీలకమయిన గోన గన్నారెడ్డి పాత్రను అల్లు అర్జున్ పోషించేరు. రేపు సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా అల్లు అర్జున్ ఆ సినిమా గురించి, అందులో తన పాత్ర గురించి చెప్పిన విశేషాలు:
రుద్రమదేవి రేపు రిలీజ్ అవుతోంది కదా ఎలా ఫీల్ అవుతున్నారు?
అల్లు అర్జున్: తెలుగు సినిమాకి ఇదొక కొత్త జోనర్. హిస్టారిక్, బయోగ్రాఫిక్ జోనర్ ఫిలిం ఇది. బయో ఎపిక్ అనాలి దీనిని. ప్రేక్షకులు ఎలా యాక్సెప్ట్ చేస్తారనే క్యూరియాసిటీగా ఉంది.
మీ రాకతో ప్రాజెక్టు స్థాయి పెరిగిందనుకోవచ్చా?
అల్లు అర్జున్: నేను ‘అవుట్ ఆఫ్ ది వే’ వెళ్లి ఈ ప్రాజెక్టు చేశా. నేనేం చేసినా నా ఇంటన్షన్ మంచి కోసమే. మన తెలుగు కల్చర్ గురించి చెప్పే సినిమాని ముదుకు తీసుకెళ్ళాలనే మంచి ఇంటన్షన్ తో చేసాను.
మీ అంతట మీరుగానే గుణశేఖర్ ని కలిసి నటిస్తానని అడిగారుట కదా?
అల్లు అర్జున్: నేను రెగ్యులర్ గానే గుణశేఖర్ గారిని కలుస్తుంటాను. ఆ సందర్భంలోనే రుద్రమదేవి కధ చెప్పారు. షూటింగ్ అంతా అయిపోయింది. కానీ గోన గన్నారెడ్డి క్యారెక్టర్ వేరే ఎవరూ చేయలేదు…అని అనుకొంటున్న టైమ్ లో నేనే వెళ్లాను. ఆ పాత్రను నాకు తగ్గట్టుగా మార్చుకోగలిగితే చేస్తానని అన్నా. ఆయన చాలా హ్యాపీ ఫీలై ఆ క్యారెక్టర్ ని తీర్చిద్దిదారు.
ఎవరూ చేయలేదు..అన్న డైలమాలో ఉన్నప్పుడు మీరే ఎందుకు చేసారు?
అల్లు అర్జున్: గుణశేఖర్ మన తెలుగు కల్చర్ కి సంబంధించి ఓ చక్కని సినిమా చేస్తున్నారు . అలాంటి సినిమాకు ఎవరూ సపోర్ట్ చేయడం లేదేంటి? అని ఫీలై ముందుకు వచ్చాను. అలాగే ఆయనే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించడం అనేది నచ్చింది. ఇంత ఫ్యాసినేట్ గా అయన చేస్తున్న ప్రయత్నం ఆకట్టుకొంది. అందుకే నేను మనస్పూర్తిగా ఫీలై చేశా. అన్నీ మనీ లెక్కలే వేయకూడదు. అందుకే నేను నటించాను.
మీరు చేసింది కరెక్టే అన్న ఫీలింగ్ ఎప్పుడు కలిగింది?
అల్లు అర్జున్: ఇందులో ఓ మంచి ఇంటన్షన్ తో దిగాను. నిజానికి ఒరిజినల్ గా గోన గన్నారెడ్డి క్యారెక్టరైజేషన్ నా కోసం వ్రాసింది కాదు. వేరే ఏజ్ గ్రూప్ కి వ్రాసుకొన్నది. నేనొక యాంగ్ హీరోని. నాకు తగ్గటే ఆ క్యారెక్టర్ ని మార్చాలి. డైలాగ్ తో సహా అన్నీ రెడీ అయ్యాక నాకు వ్యక్తిగతంగా కిక్కిచింది. ఇతనికి సూటవుద్దా? అనే లెవెల్ నుంచి ఇతనికే సూటవుద్ధి అనే లెవెల్ కి క్యారెక్టర్ మలిచారు. నేనే చేయాలి అనిపించేలా మార్చారు.
గోన గన్నారెడ్డి ఎజ్డ్ అంటున్నారు.. మరి అలాంటప్పుడుయాంగ్ హీరో యాప్ట్ కాదు కదా?
అల్లు అర్జున్: రామాయణంని బాల రామాయణంగా బాల నటీనటులతో తీసిన అనుభవజ్ఞుడు గుణశేఖర్. అందుకే రుద్రమదేవి చిత్రంలో పాత్రలన్నిటినీ యాంగ్ పీపుల్ తోనే తెరకెక్కించారు. నేను, రానా, అనుష్క, నిత్యా మీనన్, క్యాధరిన్ అన్నీ యాంగ్ క్యారెక్టర్లే.
హిస్టారికల్ అనగానే క్యారెక్టర్ల అవుట్ ఫిట్ ఎలా? ముందే ప్రేపరేషన్ ఎలా చేసారు?
అల్లు అర్జున్: రుద్రమదేవికి రిఫరెన్స్ పిక్చర్స్ ఏవీ లేవు. 16వ శతాబ్దం నుంచి పెయింటింగ్స్ ఏవీ అందుబాటులో లేవు. గోన గన్నారెడ్డి అనగానే ఒక పాపులర్ దొంగ. ఓ రాబిన్ హుడ్ తరహా క్యారెక్టర్. ఇతనికి నల్లని డ్రెస్ అవుట్ ఫిట్ కావాలి. రఫ్ గా ఉంటాడు. చినిగిపోయిన బట్టలు ఉంటాయి అని డిజైన్ చేసుకొన్నాం. దొంగ ఇలా ఉంటాడు అని సైలాజికల్ ఫీలింగ్ తో రీసెర్చ్ చేశాం.
కానీ హెయిర్ స్టయిల్ మోడరన్ గా ఉంది? అప్పట్లో లాంగ్ హెయిర్ ఉండేది!
అందుకు కధలో కూడా రీజనింగ్ ఉంది. అప్పట్లో లాంగ్ హెయిర్ లేని వాళ్ళకు బుర్ర సుంకం అని పన్ను వేసేవారు. అందుకే పొడవాటి గిరిజాలతో కనిపించేవారు. కానీ ఇందులో గోన గన్నారెడ్డి రెబల్ క్యారెక్టర్. పొట్టి హెయిర్‌తో ఇలానే ఉంటానని ఎదిరించే విప్లవకారుడు. అందుకే ఆ హెయిర్ తో కనిపించాడు. ఇది నా ఇంటర్ ప్రిటేషన్.
ఓ మంచి ఆలోచనతో ఈ పాత్ర చేసారు? వెనక్కి లాగినవాళ్ళు ఉంటారు కదా?
అల్లు అర్జున్: హీరోగా చేసేప్పుడు ఈ క్యారెక్టర్ చేయడం అవసరమా? ఎందుకు…అని చాలా మంది నన్ను వెనక్కి లాగారు. కానీ నేను ఈ క్యారెక్టర్ చేయడానికి కారణం ఆరోజుల్లో ఎన్టీఆర్, ఏ.యన్నార్ హీరోలుగా ఉంటూనే ఇలాంటి మంచి క్యారెక్టర్లు వచ్చినప్పుడు చేసేవారు. ఎన్టీఆర్ గారు 200వ సినిమాకి కూడా ఓ క్యారెక్టర్ చేసారు. అప్పట్లో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా మంచి క్యారెక్టర్లకు విలువనిచ్చేవారు. హాలీవుడ్ లో బ్రాడ్ ఫిట్ లాంటివాళ్ళు అలానే చేస్తున్నారు. నిత్యామీనన్ కూడా పాత్ర నచ్చితేనే రెడీ అంది. నేను నటిని. మంచి పాత్రలు ఏవి వచ్చినా చేస్తానని ముందుటుంది.
రానా, మేరు ఫ్రెండ్స్ కాబట్టి కలిసి నటించారా?
అల్లు అర్జున్: ఈ చిత్రంలో రానాకి నాకు కాంబినేషన్ సీన్స్ ఏవీ లేవు. ఒక్క సీన్ తప్ప. మేం ఫ్రెండ్సే కదా..అని చేసిందేమీ లేదు. ఆ అవసరం లేదు.
మీ పాత్ర భాష యాస ఎలాఉంటుంది?
అల్లు అర్జున్: గోన గన్నారెడ్డికి కొంత రాయలసీమ, కొంత పాలమూరు ప్రాంతాలతో టచ్ ఉంది. అయితే ఎక్కువ తెలంగాణాతో టచ్ ఉన్న మనిషి. అందుకే తెలంగాణా యాస ఉండాలని అనుకొన్నాం. అయితే తెలంగాణా యాస అన్ని చోట్లా అర్ధం కాదు. అందుకే అందరికీ అర్ధమయ్యేలా ఆ పాత్రతో మాట్లాడించారు. తెలంగాణా మాట్లాడితే ప్రత్యేకత ఉంటుందని భావించాం. రెగ్యులర్ బాషనే తెలంగాణా బాషలో వ్రాయిస్తే చాల బ్యూటీ వచ్చింది. చారిత్రికం కాబట్టి కొంత గ్రాంధికం ఉండాలి. కానీ గోన గన్నారెడ్డి దొంగ, బందిపోటు కాబట్టి గ్రాంధికం తీసేయవచ్చు అనుకొన్నాం. కొంత కలోకియల్ బాష మాట్లాదిన్చాం. కలోకియల్ తెలంగాణా బాష వినిపిస్తుంది.
రుద్రమదేవి తెలుగు రాణి. ఇతర బాషలలో ఎందుకు చూడాలి?
అల్లు అర్జున్: రుద్రమదేవి కధ తెలుగుకే పరిమితం కాదు. తమిళనాడు, కర్నాటక, కేరళ, మహారాష్ట్ర అన్నిటినీ కలుపుకొని సామ్రాజ్యం విస్తరించి ఉంది. అందులో వరంగల్ రాజధానిగా పరిపాలించింది. ఉమన్ ఎంపవర్ మెంట్ సినిమా ఇది. ఆడాళ్ళు ఎందుకు రూల్ చేయకూడదు? అనేది యూనివర్సల్ పాయింట్.ఆరోజుల్లో లేడీ పరిపాలన అంటే ఎలాంటి అభ్యంతరాలు ఉంటాయి? అన్నదే సినిమా. అందుకే ఏ బాషలో అయినా చూడొచ్చు.
మీ క్యారెక్టర్ విషయమై చిరు మీకు ఎం సలహా ఇచ్చారు?
అల్లు అర్జున్: సలహా ఏం లేదు. ఇందులో ఓ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓ వాయిస్ ఓవర్ వినిపించాల్సిన అవసరం ఉంది. వాయిస్ ఓవర్ ఎవరు చెపితే బావుటుందని గుణశేఖర్ ఆలోచిస్తుంటే చిరంజీవిగారు అయితే బాగుంటుందని నేనే చెప్పాను. ఒక హిస్టారికల్ సినిమాకి ఆయన వాయిస్ అయితే బావుటుందని అన్నాను. ఆయన చిరును అగడగానే ఒకే చెప్పేశారు.
బాహుబలి తరువాత ఇలాంటి చారిత్రిక కధాంశంతో మేరు భాగం అవ్వడం అదృష్టం అనుకోవచ్చా?
అల్లు అర్జున్: బాహుబలిని దీనిని పక్కనపెట్టి చూస్తున్నారు. ఎటాచ్ చేస్తున్నారు. కానీ అది జానపదం. రుద్రమదేవి హిస్టారికల్. అప్పట్లో రామారావు గారు, కృష్ణ గారు, కృష్ణం రాజుగారు…వాళ్ళు క్యారెక్టర్స్ చేస్తే అలా గుర్తుండిపోయేవి. శ్రీకృష్ణుడు, అల్లూరి సీతారామరాజు, తాండ్ర పాపారాయుడు అలా గుర్తుండిపోయే పాత్ర గోన గన్నారెడ్డి.
బాహుబలి, శ్రీమంతుడు తర్వాత మీరు గమనించిన మార్పు?
అల్లు అర్జున్: బాహుబలి, శ్రీమంతుడు, సినిమా చూపిస్తా మావా, భలే భలే మగాడివోయ్ , సుబ్రహ్మణ్యం ఫర్ సెల్ అన్నీ మంచి సినిమాలే వస్తున్నాయి. విజయాలు సాధిస్తున్నాయి. ఇది మంచి సీజన్.
వరుసగా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి…పోటీలో రిలీజ్ మంచిదేనా?
అల్లు అర్జున్: సినిమా బావుంటే నాలుగైదు సినిమాలు ఒకేసారి రిలీజైనా ఆడుతాయి.
సన్నాఫ్ సత్యమూర్తి షూటింగ్ టైంలో గోన గన్నారెడ్డి ఆఫర్ వచ్చిందని విన్నాం?
అల్లు అర్జున్: అవును. నెలరోజుల్లో సన్నాఫ్ సత్యమూర్తి మొదలవుతుంది అనగా ఈ అవకాశం వచ్చింది…ఎం చేయమంటారు? అని త్రివిక్రమ్ ని అడిగాను. ఆయన బాగా ఎంకరేజ్ చేసారు.
ఇతర మార్కేట్లని కలుపుకొనే సినిమాలు చేయరా? బాలివుడ్ వెళ్ళరా?
అల్లు అర్జున్: భవిష్యత్ లో బాలీవుడ్ సౌత్ సినిమాలు కలిసి వస్తాయి. పాన్ ఇండియన్ సినిమాలు తెరకెక్కుతాయి.అయితే బాలీవుడ్ కి వెళ్లి లాంగ్ రన్ లో కొట్టేయడం కుదరదు. ఇలా వెళ్లి అలా..రావడమే. టాలీవుడ్ వదిలేసి వెళ్లి అక్కడ సినిమాలు చేయాలనుకొంటేనే వెళ్ళాలి. కానీ అది కుదరదు. ఇక్కడ సాధించింది విడిచిపెట్టి వెళ్ళలేం. మన హీరోలంతా అక్కడికి వెళ్లి మంచి సినిమాలు చేసారు. కానీ ఇక్కడే ఫోకస్ పెట్టారు.
చిరు 150వ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారా?
అల్లు అర్జున్: చాలా ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నా.
మీ ఇంట్లోనే బోలెడంత కాంపిటిషన్ ?
అల్లు అర్జున్: మంచిదేగా, పోటీ స్పిరిట్ ఉండాల్సిందే.
20 ఏళ్ల తరువాత?
అల్లు అర్జున్: 40ఏళ్ల తరువాత కూడా మంచి నటులు కావాలి.
ముంబై విలన్లను, ఇతర బాషల నటులను తెచ్చుకొంటున్నాము?
అల్లు అర్జున్: అది కొంత వరకు కరెక్టే. కానీ కొన్ని క్యారెక్టర్లను వాళ్ళే చేయాలి. పైగా వాళ్ళకు ఉన్న ఫిజికల్ స్ట్రక్చర్ మనకు ఉండదు. అయితే మన తెలుగు నటీనటులకు ప్రోత్సాహం కావాలి. నా వంతుగా కొంత ప్రయత్నిస్తున్నా. కుదిరితే తెలుగువాళ్ళను పెట్టుకొందాం అని అంటున్నా.
భవిష్యత్ సినిమా ఎలా ఉండాలి?
అల్లు అర్జున్: న్యూ ఏజ్ సినిమాలు తీయాలి. రుద్రమదేవి ఆ తరహా సినిమానే. ఈనెల 9న రిలీజ్ అవుతున్న రుద్రమదేవి చిత్రాన్ని 3డిలో చూసి ఆస్వాదించండి. ఓ అద్భుతమయిన హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ సినిమాని చూసి ఎంజాయ్ చెయ్యండి, అంటూ అల్లు అర్జున్ తన ఇంటర్ వ్యూ ముగించారు.