తెలంగాణా రాష్ట్రంలో ప్రతిపక్షాలన్నీ కలిసి నేడు బంద్ నిర్వహిస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫాం హౌస్ లో అల్లం పంట ఎలా ఉందో చూసుకొంటున్నారు. రైతుల సమస్యలపై చర్చిస్తున్నపుడు కేసీఆర్ మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకి తన అల్లం పంట దెబ్బ తిందని… అది ఎలా ఉందో ఏమిటో.. అని అన్నట్లు వార్తలు వచ్చేయి. అప్పులు చేసి మరీ పంటలు పండిస్తున్న రైతులు ఆ అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్యలు చేసుకొంటుంటే వారి కష్టాలను, సమస్యలను తక్షణం తీర్చవలసిన ముఖ్యమంత్రి తన అల్లం పంట గురించి వాపోవడం విస్మయం కలిగిస్తుంది. సమస్య తీవ్రత గురించి ప్రతిపక్షాలు హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా తన ఫాం హౌస్ లో అల్లం పంట పైనే శ్రద్ద పెట్టడం చూస్తుంటే రోమ్ నగరం తగులబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకొంటూ కూర్చోన్నట్లుగా ఉంది.