తుమ్మలపల్లి రామసత్యనారాయణ రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవికి ఓ లేక రాసిన సంగతి తెలిసిందే. అన్నయ్యా అంటూ స్టార్ట్ చేసిన ఆ లెటర్ నేపథ్యం ఏంటంటే చిరు తనయుడు బ్రూస్ లీ సినిమా అక్టోబర్ 16న రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసుకోవాలని. ఎందుకంటే గుణశేఖర్ ఎంతో ప్రయాస పడి చేసిన రుద్రమదేవి ఎట్టకేలకు రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇలాంటి సందర్భంలో బ్రూస్ లీ సినిమా వస్తే రుద్రమదేవి కలెక్షన్లకు గుండి పడే అవకాశం ఉందని బ్రూస్ లీ సినిమాను వాయిదా వేసుకోవాల్సిందిగా పత్రికా ముఖంగానే ఓ లెటర్ రాశాడు నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ.
కాని ఆ లెటర్ కి ఏమాత్రం స్పందించని చిరు, తనయుడి సినిమా అనుకున్నట్టుగానే అక్టోబర్ 16న రిలీజ్ చేసేందుకే సిద్ధమవుతున్నారు. రీసెంట్ గా రిలీజ్ డేట్ తో కొత్త పోస్టర్స్ కూడా వచ్చాయి. ఓ నిర్మాత కష్టం తెలిసిన హీరోగా చిరుకి వినయంగా లెటర్ రాశాడు నిర్మాత తుమ్మలపల్లి. కాని దానికి ఏమాత్రం చలించలేదు మెగాస్టార్.
అయినా రిలీజ్ డేట్స్, బిజినెస్ అంతా జరిగిన తర్వాత సినిమా సడెన్ గా పోస్ట్ పోన్ చేయడం కలెక్షన్ల పరంగా కూడా దెబ్బ తినే వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే చరణ్ బ్రూస్ లీ సినిమాను అనుకున్న టైంకే రిలీజ్ చేస్తున్నారు. ఎన్నో భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమాతో శ్రీనువైట్ల గట్టి హిట్టు కొడదామనే కసితో ఉన్నాడు.