నడిగర్ సంఘం ఎలక్షన్స్ వేడి పొలిటికల్ లీడర్స్ కన్నా ఎక్కువయ్యిందని చెప్పొచ్చు. తెలుగులో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లానే తమిళ్ లో కోలీవుడ్ అంతా కలిసి నడిగర్ సంఘం ఒకటి ఉంది. అయితే గత దశాబ్ధ కాలంగా దానికి ప్రెసిడెంట్ గా ఉంటున్నాడు శరత్ కుమార్. అయితే ఈసారి అతనికి పోటీగా రంగంలో దిగాడు పందెం కోడి విశాల్. మాటల యుద్ధం తో మొదలైన ఈ ఎలెక్షన్స్ గొడవ ఇప్పుడు డైరెక్ట్ గా ఆపోజిట్ టీమ్స్ కి ఫోన్ చేసి బెదిరించడం మొదలెట్టారట.
రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టి చెండాడిన శింభు వ్యాఖ్యలకు గట్టిగానే సమాధానం చెపాడు విశాల్. అయితే రాజి కొస్తుందనుకున్న ఈ సమావేశం కాస్త ఇంకా ముదిరింది. శరత్ కుమార్ విశాల్ మీద క్రిమినల్ కేసుని కూడా పెట్టడం జరిగింది. తీవ్ర స్థాయికి చేరుకున్న ఈ గొడవలో విశాల్ కు శరత్ ప్యానల్ తరపున వారి నుండి చంపుతానని బెదిరింపు కాల్స్ వస్తున్నాయట.
ఈ నెల 18న జరుగనున్న నడిగర్ సంఘం ఎన్నికల్లో ప్రస్తుతానికైతే విశాల్ ప్యానల్ కే పట్టం కడతారని సర్వేలు వెళ్లడిస్తున్నాయి. మరి ఆరోజు ఎలక్షన్స్ టైంలో ఎన్ని గొడవలవుతాయో చూడాలి.