మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం కాని చిత్రం బ్రూస్ లీ. అంటే చిరు 150వ చిత్రం కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న మెగా అభిమానులకు బ్రూస్ లీలో ఒక మూడు నిమిషాలు కనిపించి ఫ్యాన్స్ ని ఉత్తేజ పరచనున్నాడు మెగాస్టార్. అయితే అసలు సినిమా అనుకున్నప్పుడు ఆ సీన్ కోసం మొదట కింగ్ నాగార్జున ని అనుకున్నారట. నాగ్ కూడా ఓకే చెప్పే సంకేతాలే ఇచ్చినా మళ్లీ ఎందుకో ఆ క్యారక్టర్ కి మెగాస్టార్ ని అనుకున్నారు.
ఫైనల్ గా మెగాస్టార్ 150వ సినిమా అధికారికంగా బ్రూస్ లీ అయ్యింది. డాడీ 150వ సినిమా బ్రూస్ లీ కాదు ఇది కేవలం ఆ సినిమాకు ట్రైలర్ లాంటిదే అని ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపాడు. అయితే ఒకవేళ చిరు వేసిన ఈ రోల్ నాగ్ వేస్తే ఎలా ఉండేదా అని ఆలోచిస్తున్నారు. మెగా అభిమానులతో పాటు అక్కినేని ఫ్యాన్స్ కూడా బ్రూస్ లీ సినిమాను ఎగబడి చూసేవారు.
బ్రూస్ లీ సినిమా అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించాడు. డివివి ఆర్ట్స్ పతాకంలో దానయ్య డివివి ఈ సినిమాను నిర్మించగా శ్రీనువైట్ల డైరెక్ట్ చేశాడు.