హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణ శంకుస్థాపనకు ఆటంకాలన్నీ ఎట్టకేలకు తొలగిపోయాయి. పర్యావరణ అనుమతులు లేకుండా రాజధాని నిర్మాణం తలపెట్టిన ప్రాంతంలో ఎలాంటి నిర్మాణ కార్యక్రమాలు చేపట్టొద్దని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గత శనివారం స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ అనుమతులు ఇప్పుడు లభించాయి. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఏపీ రాజధాని నిర్మాణానికి అవసరమైన అనుమతులన్నింటినీ మంజూరు చేశామని మంత్రి ఈ ఉదయం చెప్పారు. దీంతో అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి విఘ్నాలు తొలగిపోయినట్లయింది. అయినా, ప్రధానమంత్రి కార్యక్రమం ఖరారయిన తర్వాత అనుమతులదేముంది… వాటంతట అవే పరిగెట్టుకు వస్తాయి. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా!