రుద్రమదేవి సక్సెస్ తో జోష్ మీదున్న అనుష్క సినిమాల కోసం తాను ఎంతటి రిస్క్ కైనా వెనుకాడదని సినిమా చూస్తేనే అర్ధమవుతుంది. కత్తి యుద్ధాన్ని ఎంతో కష్టపడి నేర్చుకుంటే గాని అంత ఈజీగా చేయలేరు. అయితే సినిమా గురించి ఇంత కష్టపడుతుంది కాబట్టే అనుష్క క్రేజీ హీరోయిన్ అయ్యింది. సైజ్ జీరో సినిమా కోసం 20 కిలోల బరువు పెరిగిన స్వీటీ దాన్ని తగ్గించే పనిలో ఉంది. పెరగడమైతే పెరిగింది కాని తగ్గడానికి మాత్రం తెగ ఇబ్బండి పడుతుందట అమ్మడు.
అందుకే అమెరికా వెళ్లి ట్రీట్ మెంట్ తీసుకోవాలని చూస్తుంది. కుదిరితే ఈ మంథ్ ఎండింగ్ కల్లా వెళ్లి తన బాడీ ని మళ్లీ ఎప్పటి షేప్ కు తెచ్చే ప్రయత్నాలు చేస్తుంది అనుష్క. ప్రస్తుతం బాహుబలి, రుద్రమదేవి హిట్లతో ఫుల్ ఫాంలో ఉన్న అనుష్క మళ్లీ బాహుబలి-2 షూటింగ్లో పాల్గొనాల్సి వస్తుంది. అందుకే ఈలోపే తన షేప్ ని మళ్లీ నాజూకుగా మార్చే ప్రయత్నం చేస్తుంది ఈ అమ్మడు.
కోలీవుడ్లో సింగం -3 సినిమాకు మళ్లీ సూర్య సరసన నటించనుంది స్వీటీ. సింగం, సింగం -2 లో హిట్ పెయిర్ అయిన ఈ జంట మరోసారి ఆ సినిమా మూడో భాగంలో కూడా అలరించనున్నారు. ఇక సింగం-3లో శృతి హాసన్ మరో హీరోయిన్ గా చేస్తుండటం విశేషం.