తెలుగు360 రేటింగ్ : 2.75/5
కథ:
కార్తిక్ (రామ్ చరణ్) ని బ్రూస్ లీ అని ప్రేమగా పిలుస్తుంటారు. అక్క (కృతి కర్భందా) కోసం తను చదువు మానేసి ఫైటర్ గా పనిచేస్తుంటాడు. కావ్య కలెక్టర్ గోల్ రీచ్ అవ్వడానికి తన తండ్రి రామచంద్ర రావు (రావు రమేష్) తో పాటు కార్తిక్ కూడా ఎంతో తపన పడతాడు. సడెన్ గా కార్తిక్ జీవితంలోకి రియా (రకుల్ ప్రీత్ సింగ్) ఎంట్రీ ఇచ్చి లవ్ లో కూడా పడేస్తుంది. అనుకోకుండా కావ్య (కృతి కర్భందా) బీజినెస్ మ్యాన్ జై రాజ్ (సంపత్) మరియు అతని కొడుకు దీపక్ రాజ్ (అరున్ విజయ్) తో పాబ్లెమ్స్ లో పడుతుంది. వారి నుండి కార్తిక్ ఆమెను ఎలా కాపాడాడు అన్నదే మెయిన్ స్టోరీ.
అసలు కావ్యకు ఎదురైన సమస్య ఏంటి..? కార్తిక్ ఎలా తనని ఆమెను ప్రాబ్లెమ్స్ నుండి సేవ్ చేసి గోల్ ని రీచ్ అయ్యేలా చేశాడు..? అనేది అసలు సినిమా..
పాజిటివ్ పాయింట్స్:
చరణ్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో మేజర్ ఎట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఎమోషనస్ల్ సీన్స్ లో చరణ్ బాగా చేశాడు ముఖ్యంగా కృతి కర్భందాతో వచ్చే ఇంటర్వెల్ ముందు సీన్ అదిరిపోయేలా చేశాడు. ఇక చెర్రి వేసే డ్యాన్స్ ల గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలో మాంచి గ్రేస్ ఫుల్ డ్యాన్స్ తో ఫ్యాన్స్ ని అలారించాడు చరణ్.
సినిమాలో రియాగా నటించిన రకుల్ కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో అలరించింది. రకుల్ కూడా చాలా మెచ్యుర్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆమె గ్లామర్ కూడా సినిమాకు మంచి అడ్వాటేజ్ అయ్యింది. కృతి కర్భందా సిస్టర్ రోల్లో ఆకట్టుకుంది. ఇక రావు రమేష్, సంపత్ లు తమకిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. అరుణ్ విజయ్ తనకిచ్చిన విలన్ రోల్ ని నూటికి నూరుపాళ్లు న్యాయం చేశాడు.
ఎంటర్టైన్మెంట్ మేళవిస్తూ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు డైరక్టర్ శ్రీనువైట్ల. ఇలాంటి సినిమాలను తీయడంలో శ్రీనువైట్లకు మంచి పట్టు ఉంది. సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్ నింపి దానితో పాటుగా ఫ్యామిలీ ఎమోషన్స్ ని కూడా బాగా మ్యానేజ్ చేశాడు. ముఖ్యంగా చరణ్, కృతి కర్భందా, రావు రమేష్ ల మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్లు బాగా వచ్చాయని చెప్పాలి.
ఫస్ట్ ఆఫ్ మొత్తం ఎంటర్టైన్ అయిన ఆడియెన్స్ సినిమా చిరన మెగాస్టార్ ని చూసి కన్నుల పండుగ చేసుకుంటున్నారు. మెగాస్టార్ ఎంట్రీ సినిమాకే పెద్ద హైలెట్ అని చెప్పొచ్చు. 6 యేళ్ల తర్వాత కూడా స్క్రీన్ పై అదే గ్రేస్ తో కనిపించాడు మెగాస్టార్.
నెగటివ్ పాయింట్స్:
ఫస్ట్ ఆఫ్ అంతా ఎంటర్టైన్మెంట్ తో సాగిన బ్రూస్ లీ సెకండ ఆఫ్ కి వచ్చే సరికి కాస్త రొటీన్ గా స్లోగా సాగుతుంది.తన సినిమాల్లో ఎప్పుడూ ఫాలో అయ్యే అనవసర క్యారక్టర్స్ ని ఈ సినిమాలో కూడా పెట్టాడు డైరక్టర్ శ్రీనువైట్ల. చాలా క్యారక్టర్స్ సరిగా వాడుకోలేదనే చెప్పాలి.. క్యారక్టర్స్ తమ పరిధిని ఇంకా పెంచాల్సిన అవసరం ఉందనేలా స్క్రీన్ ప్లే ఉంటుంది.
కథ పాతదే అయినా కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కాని సినిమాలో చాలా సన్నివేశాలు రొటీన్ గానే అనిపిస్తాయి. సినిమా సెంకండ్ ఆఫ్ ఆడియెన్స్ ఇబ్బంది పడేలా చేసింది. సెకండ్ ఆఫ్లో ఎలాంటి సీన్లు ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేలా చేయవు.
సినిమాలో ఫైట్స్ కూడా అనుకున్నంత విధంగా రాలేదని చెప్పాలి. డైలాగులు కూడా అంత మంచిగా రాసుకోలేదు. ఇక కొన్ని సీన్లైతే ఎందుకు సడెన్ గా ఎండ్ చేశారో కూడా తెలియదు.
టెక్నికల్ డిపార్ట్మెంట్ :
సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే మనోజ్ పరమ హంస సినిమాటోగ్రాఫీ చాలా బాగా వచ్చిందని చెప్పాలి. సాంగ్స్, సీన్లలో అతని కెమెరా పనితనం గొప్పగా కనిపించింది. ఇక మ్యూజిక్ డైరక్టర్ థమన్ బ్రూస్ లీకి ఆయువు పట్టు అని చెప్పొచ్చు. సినిమాకు మంచి సంగీతాన్ని ఇవ్వడంతో పాటుగా సినిమాకు బ్యాక్ బోన్ లాంటి రీ రికార్డింగ్ ని ఇచ్చాడు. ఎం.ఆర్ వర్మ ఏడిటింగ్ బాగుంది. ఇక సినిమాలో కొరియోగ్రాఫర్ల పనితనం అద్భుతం.. సాంగ్స్ అన్ని సూపర్బ్ డ్యాన్స్ లతో అలరించాయి.
ఇక దర్శకుడు శ్రీనువైట్ల దగ్గరకు వస్తే మరోసారి తన అద్భుతమైన డైరక్షన్ టాలెంట్ ని చూపించాడు శ్రీనువైట్ల. సెకండ్ ఆఫ్ లో స్క్రీన్ ప్లే కాస్త స్లో అనిపించినా ఇలాంటి సినిమాలకు తానే కరెక్ట్ అని మరోసారి నిరూపించుకున్నాడు. అయితే బ్రూస్ లీలో అన్ని క్యారక్టర్స్ ని సరిగా వాడుకోలేదనే కామెంట్ వస్తున్నా.. సినిమాలో సెంటిమెంట్ సీన్లు మాత్రం అదరగొట్టాడు.
సినిమా నిర్మాత దానయ్య ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాలో కనబడుతున్నాయి. సినిమాలో ప్రతీ ఫ్రేమ్ చాలా రిచ్ గా కనిపిస్తుంది.
తీర్పు : బ్రూస్ లీ రెగ్యులర్ ఫ్యామిలీ డ్రామా. కాకపోతే దాన్నే కాస్త ఎంటర్టైన్మెంట్ జోడించి కమర్షియల్ సినిమాగా తీర్చిదిద్దారు. మొదటి సగం ప్రేక్షకులను అలరించినా.. సెకండ్ ఆఫ్ కాస్త నిరాశకు గురి చేస్తుంది. రామ్ చరణ్ ఎనర్జీ క్లైమాక్స్ లో మెగాస్టార్ ఎంట్రీ సినిమాకు ఆయువు పట్టు లాంటిది. మొత్తానికైతే సినిమా ఫ్యామిలీ మొత్తం చూడదగ్గ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్.