ఓ పక్క తన కొడుకులు హీరోగా దూసుకెళ్తుంటే మరోపక్క కింగ్ నాగార్జున కూడా వరుసెంట సినిమాలతో ఫుల్ ఫాంలో ఉన్నాడు. ప్రస్తుతం నాగ్ చేస్తున్న సినిమాలు సోగ్గాడే చిన్ని నాయనా, ఊపిరి. సోగ్గాడు తన సొంత బ్యానర్లో నిర్మిస్తుండగా కళ్యాణ్ కృష్ణ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తున్నాడు. నాగ్ డ్యుయల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ, లావణ్య త్రిపాటి హీరోయిన్లుగా చేస్తున్నారు. అయితే కొద్దిరోజులుగా రీ షూట్ల పర్యంతం నడుస్తున్న సోగ్గాడు ఎట్టకేలకు కంప్లీట్ అయ్యే దిశగా వెళ్తుంది.
మొదట నాగ్ సెంటిమెంట్ గా ఈ సినిమాను డిశెంబర్లో రిలీజ్ చేద్దామని అనుకున్నా.. ఇప్పుడు సంక్రాంతికే వదులుదామని అనుకుంటున్నారట. ఆల్రెడీ ఈసారి సంక్రాంతికి బాలయ్య డిక్టేటర్, ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో రిలీజ్ కు రెడీ అయ్యాయి. వారిద్దరితోనే బాక్సాఫీస్ షేక్ అవుతుంది అనుకుంటుంటే సంక్రాంతి రేస్‌లో తాను ఉంటానని వస్తున్నాడు సోగ్గాడు.
అధికారికంగా ఎనౌన్స్ చేయకపోయినా సోగ్గాడు ఖచ్చితంగా సంక్రాంతికే వచ్చే ఛాన్స్ ఉందని ఫిల్మ్ నగర్ టాక్. మరి సంక్రాంతి పోరులో నిలుస్తున్న సినిమాల్లో ఏ సినిమా విజయ బావుటా ఎగురవేస్తుందో చూడాలి.