తెలంగాణా కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తెరాస మంత్రి కె. తారక రామారావుపై విమర్శలు గుప్పించారు “చంద్రబాబు నాయుడు తను స్వయంగా వచ్చి కేసీఆర్ ని ఆహ్వానిస్తానని చెప్పగానే ఆయన ఇంకా వచ్చి పిలవక ముందే, మంత్రి కేటీఆర్ అమరావతి కార్యక్రమానికి తాము వస్తామని చాలా ఉత్సహంగా ప్రకటించేశారు. నిన్న మొన్నటి వరకు చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పిస్తూ, ఓటుకి నోటు కేసులో ఆయనని జైలుకి పంపిస్తామన్న మాట మరిచిపోయినట్లున్నారు. కేటీఆర్ కంటే వయసులో, రాజకీయ అనుభవంలో కూడా చాలా పెద్దవారయిన జానారెడ్డిపై కేటీఆర్ నోటికి వచ్చినట్లు విమర్శలు చేయడం మానుకోవాలి. ఇప్పుడిప్పుడే రాజకీయాలలోకి అడుగు పెట్టిన కేటీఆర్ ఆచితూచి మాట్లాడటం నేర్చుకోవాలి”, అని అన్నారు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంప్ కార్యాలయానికి వెళ్లి అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి రావలసిందిగా ఆహ్వానించారు. అందుకు కేసీఆర్ అంగీకరించారు.