రవితేజ.. ఈతరం హీరోల్లో కష్టపడి పైకొచ్చిన హీరో. అంటే మనోడు ఎప్పటినుండో ట్రై చేస్తే ఈతరం హీరో అయ్యాడనుకోండి. పరిశ్రమలో ఎటువంటి సపోర్ట్ లేకుండా వచ్చి స్టార్ ఇమేజ్ సంపాధించాడు మాస్ మహరాజ్. ఇక సినిమాల విషయానికొస్తే రవితేజ సినిమా అంటే అదో ఎనర్జీ. మాస్ కి పర్ఫెక్ట్ రూపమైన రవితేజ జింతాక్.. జింతాక్.. కిక్కో కిక్కు అంటూ అల్లరి చేసినా ఆయనకే చెందింది. అయితే తాజాగా కిక్-2 ఫ్లాప్ రవిని కాస్త ఇబ్బంది పడేలా చేసిందన్నది వాస్తవం.
అందుకే మరో ఎనర్జిటిక్ ఫిల్మ్ బెంగాల్ టైగర్ తో త్వరలో వచ్చేస్తున్నాడు. ఓ పక్క సర్ధార్ గబ్బర్ సింగ్ నుండి తొలగించబడ్డ డైరక్టర్ గా తనపై పడ్డ అవమానభారం తుడిచేయడానికి కసితో సినిమాను డైరెక్ట్ చేశాడు సంపత్ నంది. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న బెంగాల్ టైగర్ నిన్న ఆడియో వేడుక జరుపుకుంది. ఇక మొదటి టీజర్ తో ఆకట్టుకున్న సంపత్ నంది. ట్రైలర్ అయితే చించేశాడని చెప్పొచ్చు.
ట్రైలర్ లో ఎప్పటిలానే ఫుల్ ఎనర్జీతో కుమ్మేసిన రవితేజ ఈసారి తాను ఎవరి సపోర్ట్ లేకుండానే సోలోగా ఇంతటి వాడినయ్యానని వార్నింగ్ ఇవ్వడం కేక పెట్టించింది. తమన్నా, రాశి ఖన్నాల గ్లామర్ కూడా సినిమాకు చాలా ప్లస్ అయ్యేట్టు ఉంది. దీపావళికి రిలీజ్ అవ్వబోతున్న రవితేజ బెంగాల్ టైగర్ భీమ్స్ మ్యూజిక్ అందించగా.. కె.ఎం.రాధా మోహన్ నిర్మించడం జరిగింది.
[youtube http://www.youtube.com/watch?v=GCvipxfEnJY&w=640&h=360]