హైదరాబాద్: ఇవాళ హైదరాబాద్‌లో బయటకొచ్చిన వార్త అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఉప్పల్ ప్రాంతంలో పట్టుబడ్డ ఒక దొంగ చెప్పిన విషయాలు పోలీసులను సైతం షాక్‌కు గురిచేశాయి. తనకు ఎయిడ్స్ ఉందని, మనుషులమీద కక్షతో 300 మంది మహిళలతో శృంగార కార్యకలాపాలు జరిపి వారికి ఎయిడ్స్ వ్యాపింపచేశానని చెప్పాడు. పగలు ఆటో నడుపుతూ రాత్రిళ్ళు దొంగతనాలకు పాల్పడేవాడనినని వెల్లడించాడు. ఇవాళ అతను ఒక దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. దొంగసొమ్ముతో జేమ్స్ విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడని పోలీసులు చెప్పారు.
అయితే అతను చెప్పేది నిజమా కాదా అనేది తేలాల్సి ఉంది. జేమ్స్ 300 మంది మహిళలతో గడిపినట్లు కొన్ని మీడియా సంస్థలు, 150 మంది మహిళలతో గడిపాడని మరికొన్ని మీడియాసంస్థలు వార్తలు ఇస్తున్నాయి. పోలీసులు ప్రస్తుతం జేమ్స్‌కు వైద్య పరీక్షలు జరిపిస్తున్నారు.