సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అంటే అదో క్రేజ్.. అయితే తెలుగులో సూపర్ క్రేజ్ ఉన్న మహేష్ మొదటిసారి కోలీవుడ్ మార్కెట్ పై కన్నేశాడు. శ్రీమంతుడు సినిమా సెల్వంధన్ గా రిలీజ్ అయ్యి మొదటి రోజు కేవలం 41 లక్షలను మత్రమే కలెక్ట్ చేయగా.. అదే సూపర్ అని అనుకున్నారు. తమిళ శ్రీమంతుడు అంతగా హిట్ అవ్వక పోయినా పర్వాలేదనిపించుకున్నాడు. గుణశేఖర్ తెరకెక్కించిన రుద్రమదేవి మాత్రం మహేష్ ని బీట్ చేసింది. రుద్రమదేవి మొదటిరోజే 81 లక్షలను కలెక్ట్ చేసి సూపర్ క్రేజ్ సంపాధించింది. తెలుగులో కూడా ఈ సినిమా కలెక్షన్స్ హవా కొనసాగుతూనే ఉంది.
అనుష్క లీడ్ రోల్ చేసిన రుద్రమదేవిలో గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ అదరగొట్టాడు.. ఇక రానా, ప్రకాశ్ రాజ్, కృష్ణం రాజు ఇలా అందరు అద్భుత నటనతో సినిమాను హిట్ బాట పట్టించారు. మార్కెట్ పరంగా మహేష్ స్పామ్ ఎక్కువే అయినా శ్రీమంతుడుకి తెలుగులో వచ్చిన రిజల్ట్ తమిళ్ లో రాలేదు. అదీకాక మహేష్ సినిమా తెలుగు తమిళ్ లో రిలీజ్ చేయడం కూడా ఇదే మొదటిసారి. ఇక రుద్రమదేవి విషయానికొస్తే గుణశేఖర్ మూడేళ్ళ కష్టానికి అన్ని చోట్ల మంచి రిజల్ట్ వస్తుంది. తెలుగు హిందీలో హిట్ అయిన రుద్రమ్మ తమిళ్ లో కూడా హిట్ టాక్ తెచ్చుకుంది.