అమరావతిని విశ్వనగరంగా తీర్చిద్దిద్దాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే దేశ విదేశాలలోని పవిత్ర స్థలాలు, పుణ్య క్షేత్రాలు, పుణ్య నదులు, రాష్ట్రంలో ‘మన నీరు-మన మట్టి’ కార్యక్రమం ద్వారా 16,000 గ్రామాల నుండి సేకరించిన మట్టి-నీళ్ళను కలిపి మిశ్రమంగా చేసి దానిని అమరావతిలో వెదజెల్లుతారు. ఈరోజు ఆయన స్వయంగా దానిలో కొంత మిశ్రమాన్ని హెలికాఫ్టర్ ద్వారా అమరావతి ప్రాంతంలో వెదజల్లి సంప్రోక్షణ చేస్తారు. మిగిలిన మిశ్రమాన్ని మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు, రైతులు అమరావతిలో వెదజల్లుతారు.