తెలంగాణాలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నవరంగల్ లోక్ సభ నియోజకవర్గానికి ఉపఎన్నికల షెడ్యూల్ బుదవారం వెలువడింది. ఎన్నికలకు నోటిఫికేషన్ ఈ నెల28న వెలువడుతుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఆఖరు గడువు నవంబర్ 4, నామినేషన్ల పరిశీలన నవంబర్ 5, నామినేషన్ల ఉపసంహరణ నవంబర్ 7, పోలింగ్ తేదీ నవంబర్ 21, ఓట్ల లెక్కింపు మరియు ఫలితాల వెల్లడి నవంబర్ 24వ తేదీ. ఈరోజు నుంచే ఎన్నికల నియామావళి అమలులోకి వస్తుంది.వరంగల్ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కడియం శ్రీహరిని తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా నియమించడంతో ఆయన తన లోక్ సభ స్థానానికి రాజీనామా చేశారు.