స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈసారి తన దసరా పండుగను తన అత్తా మామల ఊళ్లో జరుపుకున్నారు. నల్గొండ జిల్లా చింతపల్లిలో బన్నీ దసరా వేడుకను జరుపుకున్నారు. తమ అభిమాన నటుడు వచ్చాడన్న విషయం తెలియగానే చాలా మంది అభిమానులు చింతపల్లి బన్నీ అత్తా మామల ఇంటికి చేరుకున్నారట. అయితే ఫ్యాన్స్ వచ్చారు కదా అని ఒక్కసారి వచ్చి వారికి అబివాదం చేసి వెళ్లాడట. కాని ఎంత చేసినా వారు అక్కడ నుండి వెళ్లక పోవడంతో దగ్గరలో ఉన్న పోలీ స్టేషన్ లో కంప్లైంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందట.
అయితే ఈవినింగ్ కల్లా పరిస్థితి చక్క బడటంతో బన్నీ ప్రియా రెడ్డిలు బాణాసంచాలు కూడా కాల్చారట. సో బన్నీ రాకతో దసరా నాడే దీపావళి కూడా జరుపుకున్నారు నల్గొండ జిలా చింతపల్లి వాసులు. నాగార్జున్ సాగర్ వెళ్లే దారిలో ఆ ఊరు ఉండటం వలన ఎక్కువమంది అభిమానులు బన్నీ కోసం వెయిట్ చేశారు. రీసెంట్ రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డిగా అరుపులు పెట్టించిన బన్నీ ప్రస్తుతం బోయపాటి సినిమా చేస్తున్నాడు. మొత్తానికి బన్నీ వచ్చిన సందర్భంగా దసరా నాడే దీపావళి కూడా జరుపుకుని సంతోషంగా గడిపారు చింతపల్లి వాసులు.